పుట:Mana-Jeevithalu.pdf/276

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
267
నిశ్చలత, ఇచ్ఛ

వాడే ఉండడు. తెలియటమంటే అజ్ఞానంగా ఉండటం. తెలియకుండా ఉండటమే వివేకానికి ఆరంభం.

78. నిశ్చలత, ఇచ్ఛ

పొడుగ్గా వంపుతిరిగి ఉన్న ఆ సముద్రతీరం మీద ఎవ్వరూ లేరు. కొద్దిమంది జాలరి వాళ్లు మాత్రం ఆ పొడుగాటి కొబ్బరిచెట్ల మధ్యనుంచి గ్రామానికి వెడుతున్నారు. నడుస్తూనే దారం వడుకుతున్నారు - తమ తొడల మీద దూదిని ఒత్తి, దారం బండికి చుడుతూ. ఆ దారం సన్నగా బలంగా ఉంది. కొంత మంది సునాయాసంగా ఒడుపుగా నడుస్తున్నారు. తక్కిన వాళ్లు కాళ్లు ఈడుస్తున్నారు. వాళ్లు సరియైన తిండి లేక, ఎండకి నల్లగా మాడి ఉన్నారు: ఓ కుర్రవాడు పాడుతూ వెళ్లాడు. పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ. సముద్రం పొంగుతూ లోపలికొచ్చింది. గాలి విసురుగా లేదు, కాని సముద్రం మాత్రం నిండుగా ఉంది, ఉధృత తరంగాలతో, నీలి, పచ్చరంగు నీళ్లలోంచి నిండు చంద్రుడు అప్పుడే పైకి లేస్తున్నాడు. పచ్చని ఇసుకకి ఎదురుగా తెల్లని అలలు.

జీవితం అసలు ఎంత సరళంగా ఉంటుందో, దాన్ని మనం అంత క్లిష్టం చేస్తాం! జీవితం క్లిష్టమైంది. కాని దానితో సరళంగా ఎలా ఉండాలో మనకి తెలియదు. క్లిష్టంగా ఉన్నదాన్ని సరళంగా సమీపించాలి, లేకపోతే దాన్ని ఎన్నటికీ అర్థం చేసుకోలేము. మనకి అతిగా తెలుసు, అందుకే జీవితం మనకి అందకుండా పోతోంది. అతిగా ఉంటే అసలు లేనట్లే. ఉన్న కొంచెంతో అపారమైన దాన్ని ఎదుర్కొంటాం. అపరిమితమైన దాన్ని ఎలా కొలవగలం? మన దర్పం మనల్ని మందకొడిగా చేస్తుంది. మన అనుభవం, జ్ఞానం మనల్ని బంధించి ఉంచుతాయి. జీవన ప్రవాహం మన పక్కనుంచే కొట్టుకుపోతుంది. ఆ కుర్రాడితో కలిసి పాడటం, ఆ జాలరి వాళ్లతో కలిసి కాళ్లీడుస్తూ నడవటం, తొడమీద దారం పేనటం, అ గ్రామస్థులతో ఉండటం, కారులో ఉన్న ఆ దంపతులతో ఉండటం, అవన్నీ చేయటానికి వారితో కలిసిపోయే చాకచక్యం కాదు. దానికి ప్రేమ కావాలి. ప్రేమ క్లిష్టమైనది కాదు. కాని, మనస్సు దాన్ని అలా చేస్తుంది. మనం మనస్సుతోనే మితిమిక్కిలిగా ఉంటాం. ప్రేమ