పుట:Mana-Jeevithalu.pdf/259

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
250
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఉన్నస్థితికి కల్పితరూపమే, మరో పేరుతో - అంతే. ఈ పోరాటం అవసరమనీ, ఆధ్యాత్మికమనీ, అభివృద్ధిదాయకమనీ, ఇంకా ఎన్నో అనుకుంటున్నారు. కాని, అదంతా మనఃపంజరంలో ఉన్నదే, భ్రాంతికి దారితీసేదే.

మీమీద మీరే ప్రయోగించుకునే ఈ చమత్కారాన్ని మీరు తెలుసుకుని ఉంటే అసత్యం అసత్యంగా గోచరిస్తుంది. భ్రాంతికోసం పోరాటం జరపటమే విధ్వంస కారకం. సంఘర్షణ అంతా, అవటం అంతా విధ్వంసమే. మనస్సు తనపై తాను ప్రయోగించుకున్న చమత్కారాన్ని తెలుసుకొన్నప్పుడు - అప్పుడు ఉన్నస్థితి మాత్రమే ఉంటుంది. అవటం అంతటినీ, ఆదర్శాలన్నిటినీ, పోల్చుకోవటాన్నీ, ఖండించటాన్నీ మనస్సు నుంచి జారవిడిచినప్పుడు, దాని నిర్మాణమే కూలిపోయినప్పుడు ఉన్నస్థితిలో సంపూర్ణ పరివర్తన కలుగుతుంది. ఉన్నస్థితికి పేరు పెట్టినంతకాలం, దానికీ మనస్సుకీ సంబంధం ఉంటుంది. ఈ పేరు పెట్టటం అనే ప్రక్రియ అంటే, జ్ఞాపకం. మనస్సు నిర్మాణమే లేనప్పుడు ఉన్నస్థితి ఉండదు. ఈ పరివర్తనలోనే సమైక్యత ఉంటుంది.

సమైక్యత ఇచ్ఛా పూర్వకమైన క్రియకాదు. సమైక్యం అయే విధానం కాదు. విధ్వంసం లేనప్పుడు, అవటానికై సంఘర్షణ, పోరాటం లేనప్పుడు - అప్పుడు మాత్రమే మొత్తంగా ఉండటం అనేది, సంపూర్ణంగా ఉండటం అనేది జరుగుతుంది.

75. భయం, తప్పించుకునే మార్గం

మేము క్రమంగా అధిరోహిస్తున్నాం కదలిక అనేది తెలియకుండా. మా క్రింద పెద్ద మేఘాల సముద్రం. కంటికి కనిపించినంత మేరా తెల్లగా మెరిసే తరంగాలు ఒకదానిపైనొకటి ఎంతో స్థిరంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. మధ్య మధ్య ఒక చుట్టు తిరిగి మరింతపైకి ఎక్కుతున్నాం. ఈ కాంతివంతమైన మరుగులో మధ్య మధ్య ఖాళీలున్నాయి. బాగా దిగువున పచ్చని భూమి. మా పైన నిర్మలంగా ఉన్న శీతాకాలపు నీలాకాశం, మృదువుగా, అనంతంగా ఉంది. మంచు నిండిన పర్వతశ్రేణి ఉత్తరం నుంచి దక్షిణందాకా పరుచుకుని ఉంది తీక్షణమైన సూర్యకాంతిలో మెరుస్తూ. ఈ పర్వతాలు పధ్నాలుగు వేల