పుట:Mana-Jeevithalu.pdf/260

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
251
భయం, తప్పించుకునే మార్గం

అడుగుల ఎత్తులో ఉన్నాయి. వాటికన్నా పైకి లేచి ఇంకా ఎక్కుతున్నాం. అది పరిచితమైన శిఖర శ్రేణి. ఎంతో సమీపంగా, నిర్మలంగా ఉన్నాయి. మేం దక్షిణంవైపు దూసుకువెళ్ళాం, చేరవలసిన ఇరవైవేల అడుగుల ఎత్తుకి చేరిన తరవాత.

పక్కన కూర్చున్న ప్రయాణీకుడు తెగమాట్లాడతాడు. ఆయనకి ఆ పర్వతాలు అపరిచితమైనవి. మేము పైకెక్కుతున్నప్పుడు ఆయన కునుకుతీశాడు. ఇప్పుడు మేలుకొని మాట్లాడటానికి ఆత్రుత పడుతున్నాడు. వ్యాపారం గురించి మొదటిసారిగా విదేశాలు వెడుతున్నట్లుంది. ఆయనకి ఎన్నింటిమీదో ఆసక్తి. వాటి గురించి బాగా తెలిసినట్లే మాట్లాడాడు. మా క్రింద ఇప్పుడు సముద్రం ఉంది దూరాన నల్లగా. కొన్ని ఓడలు ఇక్కడా అక్కడా చుక్కలు పెట్టినట్లు ఉన్నాయి. దాని ఒడ్డుమీదుగా దీపాలతో వెలుగుతున్న ఒక్కొక్క నగరం దాటాం. రెక్కలు తొణకనైనా లేదు. భయం లేకుండా ఉండటం ఎంత కష్టమో చెబుతున్నాడాయన - ఒక్క కూలిపోవటం గురించే కాదు, జీవితంలో జరిగే దుర్ఘటనలన్నిటి గురించీ. ఆయనకి వివాహమైంది. పిల్లలున్నారు. ఎప్పుడూ భయమే - భవిష్యత్తు గురించే కాదు, మొత్తంమీద అన్నింటికీ. ఆ భయానికి ప్రత్యేక కారణం లేదు. ఎంతో విజయం సాధించినా, ఈ భయం ఆయన జీవితాన్ని శక్తిహీనంగా బాధామయంగా చేస్తున్నదిట. అసలు ఆయనకి ఎప్పుడూ భయమే, కాని ఈ మధ్య మరీ ఎక్కువగా ఉంటున్నదిట. భయంకరమైన కలలు కూడ వస్తున్నాయట. ఆయన భయం గురించి భార్యకి కూడ తెలుసుట. కాని అది ఎంత తీవ్రంగా ఉన్నదో మాత్రం ఆవిడకి తెలియదుట.

భయం అనేది దేనికైనా సంబంధించే ఉంటుంది. ఊహా రూపంలో అది ఒక మాట మాత్రమే. భయం అనేమాట నిజమైన భయం కాదు. మీకు ప్రత్యేకంగా దేన్ని గురించి భయమో తెలుసునా?

"ఫలానా అని ఎప్పుడూ తెలుసుకోలేకపోతున్నాను. నా కలలు కూడా అస్పష్టంగానే ఉంటున్నాయి. వాటన్నిటిలోనూ ఉండేది భయమే. స్నేహితులతోనూ, వైద్యులతోనూ ఆ విషయం మాట్లాడాను. వాళ్లు నవ్వేసైనా ఊరుకున్నారు. లేదా, ఏవిధంగానూ సహాయపడనైనా లేదు. అంతా మాయగా