పుట:Mana-Jeevithalu.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందం

243

లిస్తూ ఉంటుంది. స్వాతిశయం, ఆకాంక్షా ఆవిడ ముఖంమీదే కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మికంగానూ, కళాకారిణిగానూ కూడా కీర్తి సంపాదించాలనుకుంటోంది. ఇప్పుడు ఆధ్యాత్మికతే గెలుస్తోంది.

తనకేమీ వ్యక్తిగత సమస్యలు లేవంది. కాని అందం గురించీ, ఆధ్యాత్మికత గురించీ మాట్లాడాలనుకుంటోంది. వ్యక్తిగత సమస్యల్ని లెక్క చెయ్యదుట, ఎంతైనా అవి అర్థరహితమైనవేనని. పెద్ద పెద్ద సమస్యల గురించే విచారిస్తుందిట. అందం అంటే ఏమిటి? అది అంతర్గతమైనదా, బాహ్యమైనదా? ఊహా విషయమూ, వాస్తవిక విషయమా, రెండూ కలిసినదా? తనకు తెలిసినదే నిశ్చయమనుకుంటోంది. నిశ్చయంగా ఉండటమే అందాన్ని కాదనటం. నిశ్చయంగా ఉండటం అంటే సంకుచితంగా అభేద్యంగా ఉండటం. విశాల హృదయం లేకుండా సున్నితత్వం ఎలా ఉంటుంది?

"అందం అంటే ఏమిటి?

ఒక నిర్వచనం కోసం గాని, సూత్రం కోసం గాని ఎదురుచూస్తున్నారా, లేక పరిశీలించాలని కోరుతున్నారా?

"అయితే పరిశీలనకూ సాధనం ఉండనక్కరలేదా? తెలుసుకోకుండా, వివరణల్లేకుండా పరిశీలించటం ఎలా? మనం ఎక్కడికి వెడుతున్నామో తెలుసుకోవాలి కదా వెళ్లే ముందు?"

జ్ఞానం పరిశీలనకి అవరోధం కాదా? మీకు తెలిసినప్పుడు ఇక పరిశీలన ఎలా సాధ్యం? "తెలిసి ఉండటం" అనే పదమే పరిశీలించడం ఆగిపోయిందని సూచించదా? తెలిసి ఉండటమంటే పరిశీలించకపోవటమే. అందువల్ల మీరు కేవలం ఒక నిర్ణయాన్నీ, ఒక నిర్వచనాన్నీ మాత్రమే అడుగుతున్నారు. అందానికి కొలమానం ఉంటుందా? అందం తెలిసిన దాన్నిగాని, ఊహించిన నమూనానిగాని పోలి ఉంటుందా? అందం చట్రం లేకుండా ఉన్న ఊహా చిత్రమా? అందం ప్రత్యేకమైనదా? ప్రత్యేకమైనది సమగ్రమైనది కాగలదా? అంతర్గతంగా స్వేచ్ఛ లేనిదే బాహ్యమైనది అందంగా ఉండగలదా? అందం అలంకారమా? ముస్తాబా? అందాన్ని బయట ప్రదర్శించటం సున్నితత్వాన్ని సూచిస్తుందా? మీరు కోరుతున్నదేమిటి? బాహ్యమైనదీ, అంతరంగికమైనదీ