పుట:Mana-Jeevithalu.pdf/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
242
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మంటల్లో ఉంది. నీళ్లు అడవి మంటల్లాగా మెరుస్తున్నాయి.

వరుసగా పొడుగునా ఉన్న గుడిసెల మధ్య నుంచి ఒక విశాలమైన దారి ఉంది. ఆ దారికిరువైపులా బాహాటంగా మురికి కాలువలు ఉన్నాయి ఊహించలేనన్ని రకాల పురుగులతో. నల్లటి బురద మీద తెల్లటి పురుగులు పెనుగులాడటం స్పష్టంగా కనిపొస్తోంది. పిల్లలు దారిలో ఆడుకుంటున్నారు, పూర్తిగా ఆటల్లో మునిగిపోయి నవ్వుకుంటూ అరుస్తున్నారు, దారినపోయే వాళ్లని పట్టించుకోకుండా. నది ఒడ్డున కొబ్బరిచెట్లు ఎర్రని ఆకాశంలో కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయి. పందులూ, మేకలూ, గొడ్లూ గుడిసెల చుట్టూ తిరుగు తున్నాయి. పిల్లలు మేకో, ఆవో అడ్డొస్తే తోలేస్తున్నారు. చీకటి పడుతూంటే గ్రామంలో సద్దుమణుగుతోంది. పిల్లలు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు తల్లులు పిలుస్తూంటే.

ఆ పెద్ద ఇంటి చుట్టూ అందమైన తోట ఉంది, చుట్టూ తెల్లని గోడలతో. తోట రంగురంగుల్లో పూసి ఉంది. బోలెడు డబ్బు ఖర్చుచేసి జాగ్రత్త తీసుకొని ఉండాలి. అత్యంత ప్రశాంతంగా ఉంది. ప్రతీదీ కళకళలాడుతోంది. అ పెద్ద చెట్టు అందం తక్కిన వాటన్నిటి పెరుగుదలకీ రక్షణ కల్పిస్తున్నట్లుగా ఉంది. ఆ నీటి ధార పక్షులకు ఆహ్లాదం గొల్పుతూ ఉండి ఉండాలి. కాని ఇప్పుడు నిశ్శబ్దంగా తనలో తనే పాడుకుంటోంది, ఏ గొడవా లేకుండా ఒంటరిగా ఉండి. రాత్రికి అన్నీ మూసేసుకుంటునట్లుగా ఉన్నాయి.

ఆవిడ నాట్యం చేస్తుంది. సంపాదన కోసం కాదు. ఇష్టం కొద్దీ. ఆవిడ బాగానే నాట్యం చేస్తుందని కొందరి ఉద్దేశం. తన కళ గురించి ఆవిడ గర్వపడుతూ ఉండి ఉండొచ్చు. ఆవిడలో దర్పం ఉంది. తాను సాధించిన దాని గురించిన దర్పమే కాదు, ఆధ్యాత్మికంగా తనకున్న విలువ గురించి కూడా లోలోపల గుర్తింపు ఉన్నట్లుంది. ఇంకెవరైనా బాహ్యవిజయానికి తృప్తి పడినట్లుగానే, తన ఆధ్యాత్మిక పురోగతికి ఆవిడ తృప్తిచెందుతోంది. ఆత్మ పురోగతి చెందటం అంటే ఆత్మవంచన చేసుకోవటమే. కాని, అది చాలా తృప్తికరంగా ఉంటుంది. ఆవిడ నగలు పెట్టుకుని ఉంది. ఆవిడ గోళ్లు ఎర్రగా ఉన్నాయి. పెదవులకు తగిన రంగువేసుకుంది. ఆవిడ నాట్యం చెయ్యటమే కాక, కళగురించీ, అందం గురించీ, ఆధ్యాత్మిక సాధన గురించీ ఉపన్యాసా