పుట:Mana-Jeevithalu.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కలిసినదా? అంతరంగికంగా లేకుండా బాహ్యంగా ఎలా ఉండగలదు? దేనికి మీరు ప్రాముఖ్యాన్నిస్తున్నారు?

"నేను రెండింటికీ ప్రాముఖ్యానిస్తున్నాను పరిపూర్ణ రూపం లేనిదే పరిపూర్ణ జీవితం ఎలా ఉండగలదు? బాహ్యమైనదీ, అంతరంగికమైనదీ కలిస్తేనే అందం.

అందుచేత అందంగా అవటానికి మీ దగ్గరొక సూత్రం ఉంది. ఆ సూత్రం అందం కాదు. కేవలం కొన్ని మాటలు మాత్రమే. అందంగా ఉండటం అంటే అందంగా అయే పద్ధతి కాదు. మీరు ప్రయత్నిస్తున్న దేమిటి?

"ఆకారం, ఆత్మ - రెండింటిలోని అందాన్నీ. చక్కని పువ్వుని పెట్టటానికి అందమైన పాత్ర కావాలి."

అంతరంగిక సామరస్యం, దానితో బాటు బాహ్య సామరస్యం సున్నితత్వం లేకుండా ఉండగలవా? అనాకారిగా ఉన్నదాన్ని గాని అందంగా ఉన్నదాన్నిగాని గ్రహించటానికి సున్నితత్వం ముఖ్యావసరం కాదా? అందం అంటే అనాకారితనాన్ని తప్పించుకోవటమా?

"నిశ్చయంగా అంతే."

సద్గుణం అంటే తప్పించుకోవటమూ, ప్రతిఘటించటమూనా? ప్రతిఘటించటంలో సున్నితత్వం ఉంటుందా? సున్నితత్వం స్వేచ్ఛగా ఉండవద్దా? స్వార్థపూరితంగా ఉన్నవారు సున్నితంగా ఉండి, అందాన్ని తెలుసుకోగలరా? ఉన్న స్థితిపట్ల సున్నితంగా, సుకుమారంగా ఉండటం అత్యవసరం కాదా? మనం అందంగా ఉందనే దాన్ని మనతో ఐక్యం చేసుకుని, అనాకారిగా ఉండే దాన్ని తప్పించుకుంటారు. అందమైన తోటతో మనల్ని ఐక్యం చేసుకోవాలని కోరుతూ, దుర్గంధంతో ఉండే గ్రామాన్ని చూడకుండా కళ్లు మూసుకుంటాం. ఒకటి ప్రతిఘటిస్తూ మరొకటి స్వీకరించాలనుకుంటాం. ఐక్యం చేసుకోవటమంతా ప్రతిఘటన కాదా? గ్రామాన్నీ, తోటనీ కూటా ప్రతిఘటించకుండా, ఒకదానితో మరొకదాన్ని పోల్చకుండా వాటిని తెలుసు కోవటమే సున్నితంగా ఉండటమంటే. మీరు అందానికి, సద్గుణానికీ మాత్రమే సున్నితంగా ఉండి, చెడ్డదాన్నీ, అనాకారినీ ప్రతిఘటించాలను