పుట:Mana-Jeevithalu.pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
239
సిద్ధాంతం

భవిష్యత్తు గురించి కాని ఉంటుంది. ప్రస్తుతం గురించి ఊహ ఉండటం కుదరదు. సిద్ధాంతవాదికి గతంగాని, భవిష్యత్తుగాని ఒక నిశ్చితస్థితి - అతడు కూడా గతానికీ, భవిష్యత్తుకీ చెందినవాడే కనుక. సిద్ధాంతవాది ప్రస్తుతంలో ఎప్పుడూ ఉండడు. అతడికి జీవితం ఎప్పుడూ గతంలోనైనా ఉంటుంది, భవిష్యత్తులోనైనా ఉంటుంది. ఇప్పుడున్న దాంట్లో ఉండనే ఉండదు. ఊహ ఎప్పుడూ గతంలోంచి వచ్చి ప్రస్తుతంగుండా భవిష్యత్తులోకి పోతుంది. సిద్ధాంతవాదికి ప్రస్తుతం అనేది భవిష్యత్తుకి దారితీసే మార్గం మాత్రమే. అందుచేత అది అంత ముఖ్యం కాదు. మార్గంతో నిమిత్తం లేదు. గమ్యం మాత్రమే. గమ్యం చేరటానికి ఏ మార్గాన్నైనా అనుసరించండి. గమ్యం నిశ్చితమైనది. భవిష్యత్తు తెలిసినదే. అంచేత ఆ గమ్యానికి అడ్డొచ్చే వాళ్లెవరినైనా అంతం చెయ్యండి.

"ఆచరణకి అనుభవం ముఖ్యం. భావాలూ, వివరణలూ అనుభవం నుంచే వస్తాయి. మీరు అనుభవాన్ని కాదనటం లేదు, నిశ్చయంగా. ఊహా ప్రణాళిక లేకుండా చర్య తీసుకుంటే అది అరాజకంగా ఉంటుంది. అది గందరగోళంగా ఉంటుంది. తిన్నగా పిచ్చాసుపత్రికి తీసుకువెడుతుంది. అదుపులో పెట్టే ఒక ఉద్దేశం అనేది లేకుండా చర్య తీసుకోమని మీరు వాదిస్తున్నారా? ముందు ఒక ఉద్దేశం లేకుండా ఏ పనైనా ఎలా చేస్తారు?"

మీరన్నట్లుగా భావం, వివరణ, నిర్ణయం అనుభవం వల్ల వచ్చినదే. అనుభవం లేనిదే జ్ఞానం ఉండదు. జ్ఞానం లేకుండా ఆచరణ ఉండదు. భావం చర్య తరవాత వస్తుందా, లేక భావం ముందొచ్చి చర్య తరవాత జరుగుతుందా? మీరు అనుభవం ముందు వస్తుందంటున్నారు, తరవాత చర్య, అవునా? అనుభవం అంటే మీ ఉద్దేశం ఏమిటి?

"అనుభవం ఒక బోధకుడికో, ఒక రచయితకో, విప్లవకారునికో ఉన్న జ్ఞానం. ఆ జ్ఞానం అతడు చదివినవాటి నుంచీ, అనుభవాల నుంచీ - తనవి గాని, ఇతరులనిగాని కూడబెట్టినది. జ్ఞానం, లేదా, అనుభవం నుంచి ఊహలు మిర్మితమవుతాయి. ఈ ఊహానిర్మాణంలో నుంచే ఆచరణ జరుగుతుంది."

అనుభవం ఒక్కటే కొలమానమా? నిజమైన కొలమానమా? అనుభవం అంటే మన ఉద్దేశం ఏమిటి? మనం కలిసి మాట్లాడుకోవటం అనుభవం;