పుట:Mana-Jeevithalu.pdf/249

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
240
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ప్రేరేపణకు ప్రతిక్రియ జరుపుతున్నారు. ఈ విధంగా ఎదుర్కొన్నదానికి ప్రతిక్రియను జరుపుతున్నారు. ఈ విధంగా ఎదుర్కొన్నదానికి ప్రతిక్రియను జరపటం అనుభవం. కాదా? ప్రేరేపణ, ప్రతిక్రియ - రెండూ ఒకేసారి జరిగే ప్రక్రియ. పూర్వరంగపు పరిధిలో అవి రెండూ నిత్యం మెదుల్తూ ఉంటాయి. అంతకు ముందు జరిగినదే ఎదుర్కొన్నదానికి జవాబు చెబుతుంది. ఈ విధంగా ఎదుర్కొన్నదానికి ప్రతిక్రియ జరుపటమే అనుభవం కాదా? ప్రతిక్రియ అంతకు ముందున్న దాన్నుంచి వస్తుంది, ప్రభావితమైన దాన్నుంచి వస్తుంది. అనుభవం కూడా ఎప్పుడూ ప్రభావితమవుతుంది. అందువల్ల ఊహకూడా. ఊహపైన ఆధారపడిన చర్య ప్రభావితమైనదీ, పరిమితమైనదీ అవుతుంది. ఒక అనుభవం, ఊహ మరొక అనుభవానికీ ఊహకీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఐక్యత సిద్ధించదు, మరింత వైరుధ్యం మాత్రమే పెరుగుతుంది. రెండు విరుద్ధమైన వాటికి ఐక్యత ఏర్పడదు. వ్యతిరేకత లేనప్పుడే ఐక్యత ఏర్పడుతుంది. కాని భావాలు ఎప్పుడూ వైరుధ్యాన్ని పెంపొందింపజేస్తాయి. వ్యతిరేకమైన వాటిమధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘర్షణ నుంచి ఐక్యత సిద్ధించదు.

ఏదైనా ఎదుర్కొన్నప్పుడు పూర్వరంగం నుంచి ప్రతిక్రియ జరగటమే అనుభవం. పూర్వరంగం గతం యొక్క ప్రభావం. గతం అంటే జ్ఞాపకం. జ్ఞాపకం యొక్క ప్రతిక్రియే భావం. అనుభవం, జ్ఞానం అనబడే జ్ఞాపకంలో నుంచి తయారైన సిద్ధాంతం ఎన్నటికీ విప్లవకారకం కాదు. అది కేవలం మార్పుచెందిన గతం మాత్రమే. విరుద్ధమైన సిద్ధాంతం, సూత్రం కూడా భావమే. భావం ఎప్పుడూ గతం నుంచి వచ్చినదే. ఏ సిద్ధాంతమూ ఏకైక సిద్ధాంతం కాదు. మీ సిద్ధాంతం కూడా తక్కిన వాటిలాగే పరిమితమైనదీ, దురభిప్రాయాలతో కూడకున్నదీ, ప్రభావితమైనదీ అని చెబితే ఎవ్వరూ మిమ్మల్ని అనుసరించరు. మనలో చాలామంది సూత్రాలకూ నిర్ణయాలకూ అలవాటు పడిపోయినందువల్ల వాటిని అనుసరిస్తాం, పూర్తిగా వినియోగింప బడతాం - స్వలాభానికి వినియోగించుకునేవాడు తానుకూడా వినియోగింప బడినట్లుగానే. ఒక భావం మీద ఆధారపడిన చర్య ఎప్పటికీ స్వేచ్ఛాయుతమైన చర్య కాజాలదు. ఎప్పుడూ బంధించే ఉంచుతుంది. ఒక గమ్యం