పుట:Mana-Jeevithalu.pdf/243

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
234
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

"నేనేం చెయ్యాలో ఎలా స్పష్టంగా తెలుసుకోగలను?"

స్పష్టమైన తరవాత చర్య తీసుకోవటం జరగదు. స్పష్టతే చర్య. మీరేం చెయ్యాలన్న విషయమే ఆలోచిస్తున్నారు గాని, స్పష్టంగా ఉండాలని కాదు. మర్యాద అనే దానికీ, మీరు చెయ్యవలసిన దానికీ మధ్య కొట్టుమిట్టాడుతున్నారు - ఆశకీ, ఉన్నస్థితికీ మధ్య మర్యాద కావాలి, ఒక ఆదర్శ వంతమైన చర్య తీసుకోవాలి అనే రెండు కోరికలుండటం వల్ల సంఘర్షణ, గందరగోళం ఏర్పడతాయి. ఉన్నస్థితిని చూడగలిగినప్పుడే స్పష్టత ఏర్పడుతుంది. ఉన్నస్థితి ఉండవలసిన స్థితి కాదు. ఉండవలసిన స్థితి ఒక మూసలో పోసిన కోరిక మాత్రమే. ఉన్న స్థితి వాస్తవమైనది, కోరవలసినది కాదు, యథార్థమే. మీరు బహుశా ఈ విధంగా యోచించి ఉండకపోవచ్చు. ఇది మంచిదా, అది మంచిదా అని బేరీజు వేసుకుంటూ, గడుసుగా లెక్కలు వేసుకుంటూ ఆలోచించి, పథకాలూ, మారు పథకాలూ యోచించుకుని ఉంటారు. అందువల్లనే అది మిమ్మల్ని ఈ గందరగోళ స్థితికి లాక్కురావటంతో మీరేం చెయ్యాలి అని అడుగుతున్నారు. గందరగోళ స్థితిలో ఏది ఎంచుకున్నా అది మరింత గందరగోళానికి దారితీస్తుంది. దీన్ని మామూలుగా, సూటిగా చూడండి. అలాచేస్తే, ఉన్నస్థితిని ఏవిధమైన వికృతం లేకుండా గమనించ గలుగుతారు. దానిలోని అర్థమే దాని చర్య. ఉన్న స్థితి స్పష్టంగా ఉన్నట్లయితే, ఇక ఎంచుకునేందుకేమీ ఉండదు, చర్య తప్ప. మీరేం చెయ్యాలి అన్న ప్రశ్నేరాదు. ఎంచుకోవటంలో సందిగ్ధత ఉన్నప్పుడే ఏంచెయ్యాలి అన్న ప్రశ్న వస్తుంది. చర్య ఎంచుకోవలసినది కాదు. ఎంచుకుని చేసే చర్య గందరగోళంలో చేసేది.

"మీరు చెప్పేది తెలుస్తోంది. నాలో నేనే స్పష్టంగా ఉండాలి. మర్యాద అనేదాని ప్రోద్బలం లేకుండా, నాకు ఏది లాభమో అని లెక్కవేసుకోకుండా, బేరం చేసే తత్త్వం లేకుండా ఉండాలి. నాకు స్పష్టంగానే ఉంది. కాని, ఈ స్పష్టతని నిలబెట్టుకోవటం కష్టం కాదా?'

కానే కాదు. నిలబెట్టుకోవటమంటే ప్రతిఘటన. స్పష్టతని నిలబెట్టుకుంటున్నారంటే గందరగోళాన్ని వ్యతిరేకించటం. గందరగోళాన్ని అనుభవిస్తున్నారు. ఆ స్థితిలో ఏ చర్య తీసుకున్నా గందరగోళానికే దారి తీస్తుంది. ఇదంతా