పుట:Mana-Jeevithalu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

"ఇది కేవలం మాటలు మాత్రమే నాకు. నేను ఆకలితో అలమటిస్తున్నాను. నాకు తిండిపెట్టండి."

తిండిపెట్టటానికి ఆకలి ఉండాలి. ఆకలిగా ఉంటే మీకు తిండి దొరుకుతుంది. మీకు ఆకలిగా ఉందా, లేక, మరోరకమైన తిండి రుచి కోసం పడే దురాశ మాత్రమేనా? మీకు దురాశగా ఉంటే, మీకు తృప్తి కలిగించేదే మీకు దొరుకుతుంది. కాని, అది త్వరలోనే అంతమవుతుంది. కాని, అది ప్రేమ అవదు.

"అయితే, నేనేం చెయ్యాలి?"

మీరా ప్రశ్న వేస్తూనే ఉండండి. మీరేం చెయ్యాలన్నది ముఖ్యం కాదు. మీరేం చేస్తున్నారన్నది తెలుసుకుని ఉండటం అత్యవసరం. మీరు భావి చర్య గురించే ఆలోచిస్తున్నారు. వెంటనే చర్య తీసుకోకుండా ఉండటానికి ఇదొక మార్గం. మీరు చర్య తీసుకోవాలనుకోవటం లేదు. అందుకే మీరు పదేపదే అడుగుతున్నారు మీరేం చెయ్యాలని. మీరు మళ్లీ గడుసుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. అందుకే మీ హృదయం శూన్యంగా ఉంది. మీ మనస్సుకి చెందిన వాటితో దాన్ని నింపాలనుకుంటున్నారు. కాని, ప్రేమ మనస్సుకి చెందినది కాదు. మీ హృదయాన్ని శూన్యంగా ఉండనివ్వండి. దాన్ని మాటలతో, మానసిక చర్యలతో నింపకండి. మీ హృదయాన్ని పూర్తిగా శూన్యంగా ఉండనివ్వండి. అప్పుడే అది నిండుతుంది.

60. ఫలితం యొక్క నిరర్థకత

వాళ్లు ప్రపంచంలోని వివిధ భాగాలనుంచి వచ్చారు. మనలో చాలా మందికి ఎదురయ్యే సమస్యల గురించి చర్చిస్తున్నారు. మాట్లాడుకోవటానికి బాగానే ఉంటుంది. కేవలం మాటలవల్లా, గడుసు వాదనలవల్లా, విస్తారమైన జ్ఞానం వల్లా బాధాకరమైన సమస్యల నుంచి విముక్తి లభించదు. గడుసు తనం, విజ్ఞానం తమ నిష్పలత్వాన్ని ఋజువు చెయ్యవచ్చు. ఆ నిష్పలత్వాన్ని కనిపెట్టినప్పుడు మనసు నిశ్శబ్దమౌతుంది. నిశ్శబ్దంలో సమస్య అవగాహన