పుట:Mana-Jeevithalu.pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
168
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.


కాని ఆవిష్కృతమైన దాన్ని వెంటనే అలంకార భూషితం చేయటమో, నాశనం చేయటమో జరుగుతుంది. అందుచేత సహజత్వాన్ని అంతం చేయటమవుతుంది. సహజత్వాన్ని హతమార్చటం అల్పమనస్సు అవలంభించే పద్ధతి. దానికోసం బాహ్యంగా కూడా అలంకరిస్తుంది - ఏ స్థాయిలోనైనా. ఈ అలంకరణే స్వీయ ఆరాధన. సహజత్వంలోనే, స్వేచ్ఛలోనే ఏదైనా కనుక్కోవచ్చు. క్రమశిక్షణ పొందిన మనస్సు కనుక్కోలేదు. ఎంతో సమర్ధవంతంగా, దానికోసం నిర్దయగా ప్రవర్తించవచ్చు. కాని, ఆలోతు తెలియనంత ప్రగాఢమైన దాన్ని కన్నుక్కోవటం సాధ్యం కాదు. భయమే క్రమశిక్షణ అనే ప్రతిఘటనని సృష్టిస్తుంది. కాని, అప్రయత్నంగా భయాన్ని కనుక్కున్నప్పుడు భయం నుంచి విముక్తి లభిస్తుంది. ఒక పద్ధతికి అనుగుణంగా ఏ స్థాయిలోనైనా, ఉండటమే భయం. అది సంఘర్షణనీ, గందరగోళాన్నీ వైరుధ్యాన్నీ పెంపొందిస్తుంది. ఎదురు తిరిగిన మనస్సు భయం లేకుండా ఉండదు, ఎందువల్ల నంటే వ్యతిరేకమైనది ఎన్నటికీ సహజంగా స్వేచ్ఛగా ఉండదు.

సహజంగా ఉండకుండా ఆత్మజ్ఞానం ఉండటం సాధ్యంకాదు. స్వీయ జ్ఞానం లేకపోతే మనస్సు మీద వచ్చేపోయే ప్రభావాలుంటాయి. ఈ వచ్చేపోయే ప్రభావాలు మనస్సుని సంకుచితంగా గాని, విస్తృతంగా గాని చేస్తాయి. కాని, ఇంకా ప్రభావపు పరిధిలోనే ఉంటుంది. ఒకటిగా కూర్చిన వాటిని తిరిగి విడగోట్టవచ్చు. ఆవిధంగా లేనటువంటి దాన్ని స్వీయజ్ఞానం ద్వారానే తెలుసుకోవటం సాధ్యం. "నేను" అనేది దగ్గరగా కూర్చబడినటువంటిదే. "నేను"ని విడగొట్టటంలోనే ప్రభావాల ఫలితమైనటువంటి దాన్నీ, కారణాలకు అతీతమైనటువంటి దాన్నీ తెలుసుకోవచ్చు.


54. చేతన, అంతశ్చేతన

ఆయనొక వ్యాపారస్థుడు, రాజకీయవేత్త కూడా. రెండు విధాలా విజయవంతమయాడు. వ్యాపారం, రాజకీయాలూ - రెండూ మంచి జోడి అన్నాడాయన నవ్వుతూ. అయినా, ఆయన ఒక విధంగా మూఢవిశ్వాసాల్లో