పుట:Mana-Jeevithalu.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
169
చేతన, అంతశ్చేతన

నమ్మకం గలవాడే. వీలు చిక్కినప్పుడల్లా పవిత్ర గ్రంథాలను చదువుతాడుట. కొన్ని పదాల్ని పదేపదే పునశ్చరణ చేస్తాడుట. వాటివల్ల లాభం ఉందనుకుంటాడాయన. వాటివల్ల ఆత్మశాంతి చేకూరుతుంది అన్నాడాయన. ఆయన వయస్సు మీరినవాడే. ఆయన డబ్బున్నవాడు. ఆయన చేత్తోగాని, హృదయంతోగాని ఔదార్యం చూపినవాడు కాదు. ఆయన ఎంతో గడుసువాడనీ, ముందువెనకా ఆలోచించే రకమనీ తెలుస్తూనే ఉంది. అయినా, భౌతిక విజయం కాక, ఇంకేదో కావాలన్న తపన ఉంది. జీవితం ఆయన్ని స్పృశించనేలేదని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆయన ఎంతో కష్టపడి తన్ను తాను రక్షించుకున్నాడు. ఏ విధమైన ప్రభావానికీ లోబడిపోకుండా. శారీరకంగానూ, మానసికంగానూ కూడా ఆయన తన్ను తాను అభేద్యంగా చేసుకున్నాడు. మానసికంగా తను ఉన్నది ఉన్నట్లుగా చూసుకోవటానికి ఇష్టపడలేదు. ఆపని చెయ్యగల స్తోమత ఆయనకుంది. కాని, దాని ఫలితం ఆయన మీద పని చెయ్యటం మొదలుపెట్టింది. ఆయన జాగ్రత్తగా గమనించకుండా ఉన్నప్పుడు, ఆయనలో ఎవరో వెంట పడుతున్నట్లుంటుంది ఆయన చూపు. ధనరీత్యా ఆయన సురక్షితంగానే ఉన్నాడు. అధమం, ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నన్నాళ్లూ ఏవిధమైన పరివర్తనా ఉండదు. ఆధ్యాత్మిక లోకం అనే దాంట్లో కూడా ఆయన రక్షణ కోసం కొంత ప్రయత్నించదలుచుకున్నాడు. తను సొంతం చేసుకున్నవాటి మీద తప్ప ఆయనకు ప్రేమలేదు. పిల్ల తల్లిని వాటేసుకున్నట్లుగా వాటిని కరుచుకుని ఉన్నాడాయన. ఆయనకి అంతకన్న వేరే ఏమీ లేదు. మెల్లిగా ఆయనకి తెలుస్తోంది తను ఎంతో దుఃఖితుడని. ఈ గ్రహింపు కలగకుండా వీలైనంతవరకు తప్పించుకున్నాడు. కాని జీవితం ఆయన్ని ఒత్తిడి చేస్తోంది.

ఒక సమస్యని వ్యక్తంగా ఉన్న చేతన పరిష్కరించ లేకుండా ఉంటే, అవ్యక్తంగా వుండే అంతశ్చేతన దానిని పరిష్కరించటంలో సహాయపడుతుందా? ఈ వ్యక్తంగా ఉన్నదేమిటి? అవ్యక్తంగా ఉన్నదేమిటి? ఈ రెండింటికి మధ్యా ఒక గీత ఉన్నదా, ఒకటి ఆఖరై రెండవది మొదలయే చోట? వ్యక్తంగా ఉన్న దానికొక పరిధి ఉందా - దాన్ని దాటి వెళ్లలేక పోవటానికి? తన హద్దులకు తన్ను తానే పరిమితం చేసుకుంటుందా? అవ్యక్తంగా ఉన్నది వేరు,