పుట:Mana-Jeevithalu.pdf/174

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
165
సహజత్వం

నాకు? చెయ్యిపట్టుకోవటం యథార్థం. అసూయ కూడా వాస్తవమే. అసూయ ఎలా పనిచేస్తుందో మీరు చెయ్యిపట్టుకున్నారన్నది నేను జ్ఞాపకం తెచ్చుకోవటం మూలంగా అర్థమవుతుందా? జ్ఞాపకం పోలుస్తుంది, మార్పులు చేస్తుంది, ఖండిస్తుంది, సమర్థిస్తుంది, ప్రత్యేకంగా గుర్తిస్తుంది. కాని అవగాహన కలుగజేయలేదు. ప్రేమ అనబడే రంగంలోని యథార్థాలను భావాలతోనూ నిర్ణయాలతోనూ సమీపిస్తాం. అసూయ అనే సత్యాన్ని విడిగా తీసుకుని దాన్ని నిశ్శబ్దంగా గమనించం. కాని ఆ సత్యాన్ని మెలికలు తిప్పుతాం - ఒక పద్ధతి ప్రకారం, ఒక నిశ్చితాభిప్రాయం ప్రకారం. మనం దాన్ని సమీపించే విధానం అదే. ఎందువల్లనంటే, అసూయ అనే సత్యాన్ని అర్థం చేసుకోవటం మనకి నిజంగా ఇష్టం లేదు కనుక. అసూయ యొక్క అనుభూతులు కూడా కౌగిలింత మాదిరిగానే ఉత్తేజకరంగా ఉంటాయి. కాని, మనకి బాధ, అసౌకర్యం లేకుండా ఉత్తేజం కావాలి - ఉత్తేజంతో బాటు అవీ అనివార్యమైనప్పటికీ. అందువల్లనే ప్రేమ అనే రంగంలో సంఘర్షణ, గందరగోళం, వైరుధ్యం ఉంటాయి. కాని అది ప్రేమా? ప్రేమ ఒక భావమూ, ఒక అనుభూతీ, ఉత్తేజమూనా? ప్రేమ అంటే అసూయా?

"భ్రమ లోనే నిజం పొదిగి ఉండదా? కాంతిని చీకటి ఆవరించదా? దాచి ఉంచదా. దైవం బంధింపబడి లేదా?"

ఇవన్నీ ఊహలూ, ఉద్దేశాలూ. అంచేత వాటిల్లో నిజం లేదు. అటువంటి ఊహలు శత్రుత్వాన్ని పెంపొందిస్తాయి. అవి సత్యాన్ని కప్పి ఉంచలేవు, వెలుగు ఉన్నచోట చీకటి ఉండదు. చీకటి వెలుగుని దాచి ఉంచలేదు. అది అలాచేసిందంటే అది వెలుగు కాదన్న మాటే. అసూయ ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. భావంలో ఉండదు ప్రేమ. పరస్పర సంబంధం ఉన్నప్పుడే ఒకరినొకరు తెలుసుకోగలుగుతాం. ప్రేమ భావంతో ముడిపడి లేదు. అందువల్ల భావంతో ప్రేమని సమీపించలేము. ప్రేమ పొగలేని జ్వాల.


53. సహజత్వం

ఏదో గంభీర విషయాన్ని చర్చించటానికి వచ్చిన కొద్దిమందిలో ఆవిడ