పుట:Mana-Jeevithalu.pdf/161

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
154
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మంతా ఏదో ఒక విధంగా అణగత్రొక్కబడే ఉన్నాను. నేను కావాలనుకున్నది ఒక్కటీ చెయ్యలేక పోయాను."

అంతర్గతంగానూ, బాహ్యంగానూ వాటిని అర్థం చేసుకోవటం కన్న అణచిపెట్టటం తేలిక. అర్థం చేసుకోవటం శ్రమతో కూడినది - ముఖ్యంగా చిన్నతనం నుంచీ ప్రభావితం అయినవారికి, కష్టమనిపించినా, అణచిపెట్టటం అలవాటయిపోతుంది. అవగాహన చేసుకోవటాన్ని అలవాటు చేసుకోవటం ఎన్నటికీ సాధ్యం కాదు. అది దినచర్య కాజాలదు. దానికి నిత్యం జాగరూకతతో గమనించటం, చురుకుగా ఉండటం అవసరం. అర్థం చేసుకోవటానికి మృదుత్వం, సున్నితత్వం, ఆప్యాయతా ఉండాలి. ఆవేశంతో కూడిన అనురాగం కాదు. అణచిపెట్టటానికి చురుకుగా తెలుసుకోవలసిన అవసరం లేదు. ప్రతిక్రియలతో వ్యవహరించేందుకు ఆ మార్గం అన్నిటికన్నా సులభమైనదీ, తెలివి తక్కువదీ. అణచిపెట్టటం అంటే ఒక అభిప్రాయానికీ, ఒక పద్ధతికీ అనుగుణంగా ఉండటం. అది పైపైకి రక్షణ, గౌరవం కలుగజేస్తుంది. అవగాహన విముక్తిని కలుగజేస్తుంది. కాని అణచిపెట్టటం ఎప్పుడూ సంకుచితంగా స్వార్థపూరితంగా చేస్తుంది. అధికారమన్నా, రక్షణ లేక పోవటమన్నా, సంఘమన్నా ఉండే భయం సిద్ధాంతపరమైన ఆశ్రయాన్ని సృష్టిస్తుంది. దాని భౌతిక స్థితి వైపుకి మనస్సు మళ్లుతుంది. ఈ ఆశ్రయం, ఏ స్థాయిలో ఉన్నా, ఎప్పటికీ భయాన్ని పోషిస్తూనే ఉంటుంది. ఆ భయం నుంచే ప్రత్యామ్నాయం వెతకటం, పవిత్రతని ఆపాదించటం, క్రమశిక్షణా మొదలైన అణచిపెట్టే పద్ధతులు వస్తాయి. అణచిపెట్టబడినది బయటకొచ్చే మార్గం ఏదో చూసుకోవాలి - అది శారీరక రుగ్మత కావచ్చు, సిద్ధాంత సంబంధమైన భ్రమకావచ్చు. ఎవరి ప్రవృత్తిని, విపరీత ప్రవర్తనలనూ బట్టివారు అనుభవించ వలసివస్తుంది.

"నేను గమనించాను - ఎప్పుడైనా నాకిష్టం లేనిది వినదలుచుకోనప్పుడు ఈ సాధనమే నాకు ఆశ్రయమవుతుంది. నేను నా ప్రపంచంలోకి పారిపోయేందుకు సహాయపడుతుందది. కాని, సంవత్సరాల తరబడి అణచిపెట్టిన వాటి నుంచి ఎలా విముక్తి పొందటం? దానికి ఎంతో సమయం పట్టదా?"