పుట:Mana-Jeevithalu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మరిచిపోవచ్చు. మీ ఇష్టం వచ్చినది చెయ్యండి. ఒంటరితనం బాధ కొనసాగుతూనే ఉంటుంది. మీ కొడుకు కోసమే, మీ గురువు కోసమే, మీ సహజ సామర్థ్యాన్ని ప్రదర్శించడం కోసమే మీరు బ్రతుకుతూ ఉండొచ్చు. అయినా ఒంటరితనం బాధ కొనసాగుతూనే ఉంటుంది. అయినా ఒంటరితనం అలాగే నిరీక్షిస్తూ, పరికిస్తూ, వెనక్కి ముడుచుకుంటూ, మళ్ళీ ముందుకి సమీపిస్తూ ఉంటుంది.

ఒంటరితనం పూర్తిగా వేరైపోవడాన్ని తెలియజేస్తుంది. మన కార్యకలాపాలన్నీ స్వార్థపూరితమైనవి కాదా? మన సంబంధాల్లో, మన హక్కుల్లో, ఆస్తిపాస్తుల్లో ఆధిక్యాన్ని కోరడం లేదా? ఆ విధంగా ప్రతిఘటనని సృష్టించడం లేదా? పనిని "నీది" అనీ, "నాది" అనీ చూడటం లేదా? మనం ఒక సంఘంతో, ఒక దేశంతో, కొద్దిమందితో ఏకమై ప్రత్యేకించుకోవడం లేదా? మనల్ని మనం ప్రత్యేకించుకునే ధోరణి విభజించడానికీ, వేరు చేయడానికీ కాదా? అసలు ఆత్మ కార్యకలాపమే ఏ స్థాయిలోనైనా ప్రత్యేకించుకొనేదే. ఒంటరితనం అనేది ఏ విధమైన కార్యకలాపమూ లేని వ్యక్తి స్వీయ చైతన్యావస్థ. ఏ కార్యకలాపమైనా, శారీరకమైనదైనా, మానసికమైనదైనా స్వీయ విస్తరణకి అంటే స్వప్రయోజన విస్తరణకి మార్గం అవుతుంది. ఏ విధమైన కార్యకలాపమూ లేనప్పుడు తన లోపలి శూన్యత తెలిసివస్తుంది. ఈ శూన్యాన్నే మనం నింపటానికి ప్రయత్నిస్తాం. ఆ నింపటంలోనే మన జీవితాన్ని గడుపుతాం - ఉదాత్తంగానో, నీచంగానో. ఉదాత్తస్థాయిలో నింపటం వల్ల సాంఘికంగా ఏ విధమైన హానీ లేనట్లు కనిపించవచ్చు. కాని, భ్రమ చెప్పలేనంత దుఃఖాన్నీ, వినాశాన్నీ పెంపొందిస్తుంది - అది తక్షణం కాకపోవచ్చు. ఈ శూన్యాన్ని నింపాలనే తాపత్రయం, లేదా దాన్నుంచి పారిపోవాలనుకునేది - ఏదైనా ఒకటే - దాన్ని పవిత్రం చెయ్యటానికి గాని, అణచిపెట్టటానికి గాని సాధ్యం కాదు. ఆ అణచిపెట్టే, పవిత్రం చేసే రూపం ఏమిటి? ఆ రూపం కూడా మరోరకమైన తాపత్రయమే కాదా? వేటికోసం తాపత్రయపడతామో అవి మారవచ్చు. కాని, అన్ని తాపత్రయాలూ ఒకలాంటివే కాదా? మీ తాపత్రయం తాగుడు నుంచి కాల్పనిక ప్రక్రియకి మారవచ్చు. కాని, ఈ తాపత్రయపు ప్రక్రియని అర్థం చేసుకోకపోతే భ్రమ