పుట:Mana-Jeevithalu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

'నేను' స్వభావమే విసుగు కలిగించేది. దాని తత్త్వమే అసహనంగా ఉండటం, అర్థం లేకుండా ఉండటం, వ్యర్థంగా ఉండటం. దాని పరస్పర వ్యతిరేకమైన, విరుద్ధమైన కోరికలూ, ఆశలూ, నిరాశలూ, నిజాలూ, భ్రమలూ సమ్మోహితం చేస్తాయి. అయినా, అది శూన్యంగానే ఉంటుంది. దాని కార్యకలాపాలే దానికి నిస్త్రాణ కలిగిస్తాయి. 'నేను' స్వభావమే ఎప్పుడూ పైకెక్కుతూ, క్రిందికి దిగుతూ, అర్రులు చాస్తూ, నిస్పృహ చెందుతూ, ఎప్పుడూ లాభం పొందుతూనో నష్టపడుతూనో ఉంటుంది. ఈ వ్యర్థ పరిశ్రమ నుంచి ఎప్పుడూ తప్పించుకోవాలని ఉంటుంది. సంతృప్తి కలిగించే భ్రమలు - తాగుడు, లైంగికానుభవం, రేడియో, పుస్తకాలూ, జ్ఞానం, వినోదాలూ మొదలైన బాహ్య కార్యకలాపాల ద్వారా తప్పించుకుంటుంది. అది భ్రమలను పెంపొందించుకునే శక్తి - నానావిధ సమ్మిళితమైనదీ, అపారమైనదీ. ఈ భ్రమలు సవయంకృతమైనవీ, స్వయంకల్పితమైనవీ. అవే ఆదర్శవంతమైన, ఆరాధనా రూపాలైన గురువులూ, రక్షకులూ, తన్నుతాను శక్తివంతం చేసుకునేందుకు సాధనమైన భవిష్యత్తూ మొదలైనవి. తన విసుగుదల నుంచి తానే తప్పించుకోవటానికి 'నేను' అంతర్గతంగానూ, బహిరంగంగానూ తన అనుభూతులనూ ఉత్తేజాలనూ అనుసరిస్తుంది. ఆత్మ సంయమనానికి ఇవి ప్రత్యామ్నాయాలు. ఈ ప్రత్యామ్నాయాల్లో పడి తప్పించుకుపోవాలంటుంది. తరుచు విజయం సాధిస్తుంది. కాని ఆ విజయం దాని అలసటని మరింత అధికం చేస్తుంది. ఒక ప్రత్యామ్నాయం తరువాత మరొక దాన్ని అనుసరించటంలో ప్రతి ఒక్కటీ దాని సమస్యల్నీ దాని సంఘర్షణనీ, బాధనీ సృష్టిస్తుంది.

వ్యక్తి స్వీయ విస్మరణ కోసం అంతర్గతంగానూ బహిరంగంగానూ ప్రయత్నం జరుపుతాడు. కొంతమంది మతంవైపూ, మరి కొంతమంది ఏదో పనివైపూ, ఏవో కార్యకలాపం వైపూ మళ్లుతారు. తనను మరచిపోయేందుకు ఏవిధమైన మార్గమూ లేదు. లోపలా, బయటా ఉండే చప్పుడు తనని అణచి ఉంచవచ్చు. కాని, అంతలోనే అది మరో రూపంలో, మరో వేషంలో బయటికి వస్తుంది. అణగి ఉన్నది ఎప్పుడో అప్పుడు విముక్తి పొందాలి. త్రాగుడు, లైంగికానుభవం, భక్తి, జ్ఞానం - ఇటువంటి వాటి ద్వారా కలిగిన స్వీయ విస్మరణ వాటిపైన ఆధారపడేటట్లు చేస్తుంది. దేనిమీదైనా ఆధారపడితే అది