పుట:Mana-Jeevithalu.pdf/126

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
117
"నా మార్గం - మీ మార్గం"

అర్పించుకుంటారు.

అధికారి అధికారాన్ని పెంపొందించుకుంటాడు. అధికారం ఎప్పుడూ కేంద్రీకృతం అవుతుంది. అందువల్ల పూర్తిగా అనర్థమవుతుంది. అధికారాన్ని చెలాయించేవాడినే కాకుండా అతన్ని అనుసరించేవాడిని కూడా చెడగొడుతుంది. జ్ఞానంతోనూ, అనుభంతోనూ వచ్చే అధికారం వక్రగతికి తెస్తుంది - అది దివ్యప్రభువులో ఉన్నా, ఆయన ప్రతినిధిలో ఉన్నా, మత ప్రవక్తలో ఉన్నా. మీ సొంత జీవితమూ, ఈ అనంతమనిపించే సంఘర్షణే ముఖ్యం కాని ఒక పద్ధతో, ఒక నాయకుడో కాదు. దివ్య ప్రభువు యొక్క అధికారం గాని, మత ప్రవక్త అధికారం గాని మిమ్మల్ని ముఖ్య సమస్య నుంచి - అంటే మీ అంతస్సంఘర్షణ నుంచి దూరం చేస్తుంది. జీవనవిధానాన్ని అన్వేషించటం ద్వారా దుఃఖాన్ని అర్థం చేసుకోవటంగాని, రూపుమాపటం గాని సాధ్యం కాదు - అటువంటి అన్వేషణ దుఃఖాన్ని తప్పించుకోవటానికి మాత్రమే. ఒక పద్ధతిని తమపైన విధించుకోవటం తప్పించుకునే మార్గమే. తప్పించుకున్నది ప్రకోపించి మరింత విపత్తునీ బాధనీ తెస్తుందంతే. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవటం ఎంత బాధాకరమైనా, లేదా తాత్కాలికంగా ఆనందదాయకమైనా, దానితో వివేకం ఆరంభమవుతుంది.

వివేకానికి మార్గంలేదు. మార్గం ఉన్నట్లయితే అది రూపొందింపబడినదీ, అప్పుడే ఊహింపబడినదీ, తెలిసిపోయినదీ అయి ఉంటుంది. వివేకం తెలుసుకోగలిగేదా, అలవరచుకోగలిగేదా? అది నేర్చుకునే విషయమా? పోగుచేసుకునేదా? అలాగే అయితే, అప్పుడది జ్ఞానం మాత్రమే అవుతుంది - అనుభవం వల్ల కలిగినది కావచ్చు, పుస్తకాల్లో ఉన్నది కావచ్చు. అనుభవం, జ్ఞానం గొలుసులా సాగే ప్రతిక్రియలు. అందువల్ల అవి కొత్తదాన్నీ, తాజాగా ఉన్నదాన్నీ, సృష్టింపబడని దాన్నీ ఎన్నటికీ తెలుసుకోలేవు. అనుభవం, జ్ఞానం కొనసాగుతూ ఉండేవి కాబట్టి తమ స్వయంకల్పిత రూపాలకు మార్గాన్నేర్పరచుకుంటున్నాయి. అందువల్ల అవి అనువిత్యం బంధనంగా ఉంటాయి. ఉన్న స్థితిని క్షణక్షణమూ అనుభవాన్నీ, జ్ఞానాన్నీ కూడబెట్టకుండా అవగాహన చేసుకోవటం వివేకం. కూడబెట్టినది స్వేచ్ఛగా అవగాహన చేసుకోనివ్వదు. స్వేచ్ఛ లేనిదే సాక్షాత్కారం కాదు. ఈ అనంతమైన