Jump to content

పుట:Mahendrajalam.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రాక్షకాయలు బాగా లావుగా వున్న వాటిని - పండిన తరువాత తీసుకువచ్చి, వాటిపైన వున్న పలకలు, గుబ్బలు చెక్కివేసి, మనకు కావలసిన పలకలు, గుబ్బలు గల 'డై'లో బెట్టి ప్రెస్ చేసిన తరువాత దానిని యెండబెట్టిన, అదికూడా కావలసిన రీతిలో కనుపిస్తుంది.

భూమిలో నుంచి దైవ విగ్రహం పుడుతుంది

ఈ ప్రదర్శనకు నల్లరేగడ భూములు చాలా అనుకూలంగా వుంటవి. లేక మెత్తటి మట్టి గల ప్రదేశాలుకూడా అనుకూలమే! భూమిని గజమున్నరలోతు, గజంవెడల్పువుండేటట్లుగా త్రవ్వాలి. అ తరువాత ఒకరోజు - నానబెట్టిన సెనగలు ఆ గుంటలో అర్ద గజం వరకు పోసి, ఒక పాతిక గజంమట్టి పోసిన తరువాత ఏదో ఒక దైవ విగ్రహాన్ని దానిలోబెట్టాలి. అ తరువాత మట్టిచే అ గోతినిపూడ్చి నేలచదునుచేసిరావాలి. ప్రతి దినం ఆ ప్రదేశంలో బాగా నీళ్ళుపోస్తుంటే ఏదో ఒక రోజు దైవ విగ్రహం భూమిని చీల్చుకొని బైటికి వస్తుంది. ప్రచారం సాగిస్తే ప్రజా వెల్లువ ప్రవాహంలాగా వచ్చి కానుకలు, మ్రొక్కులు సమర్పించిపోతుంటారు. ఇలా జీవించే వారిచే సృష్టించబడిన, "స్వయంభూ దైవక్షేత్రాలు"గా ప్రసిద్ధి వహించినవి చాలా వున్నవి మనదేశంలో.

కర్పూరం అదే వెలుగుతుంది

పల్చటి తెలుపు గుడ్డ పీలికను తడిపి, దానిలో చిన్న భాస్వరం ముక్కను చుట్టి, కర్పూరం వెలిగించే గుంటలోబెట్టి