పుట:Mahendrajalam.djvu/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వుంచాలి. ఆ గుడ్డపీలిక తడి ఆరిపోతున్న తరుణంలో అందరూ చూసే విధంగా హారతి పాత్రను పైకెత్తి పట్టుకొని ప్రేక్షకులందచేసిన కర్పూర గడ్డను దానిలో వేసి, కళ్ళు మూసుకొని జపం నటిస్తుంటే - భాస్వరం నుండి కర్పూరం వెలుగుతుంది. అందరూ ఈ వినోదాని కమితాశ్వర్యం జెందగలరు.

ఉత్త కాగితంలో కొత్త పువ్వు

ప్రదర్శకుడు ఒక తేలికైన పుష్పాన్ని తన చేతి వ్రేళ్ళసందులలో - వెనుకప్రక్క కుండునట్టుగా నొక్కిపట్టి వుంచి - ముందు ప్రక్క ఒక కాగితాన్ని వ్రేళ్ళపై వుండునట్టు బొటనవ్రేలితో పట్టుకొని ప్రేక్షకులకు చూపించి, ఆ కాగితంలో పుష్పాన్ని రప్పిస్తానని చెప్పి - తన చేతితో సహా అ కాగితాన్ని ఎడమ అరచేతిలో పెట్టుకొని కొంచెం సేపు ఏదో మంత్రించినట్లు నటిస్తూ పుష్పానికి పట్టు తప్పించి కాగితాన్ని పొట్లం కట్టి - ప్రేక్షకుల కిచ్చి విప్పిచూడమనాలి. వారా పొట్లాం విప్పి అందున్న పుష్పాన్ని చూచి ఆశ్చర్యానందాలు పొందెదరు.

పంచదార లేకుండా తియ్యటి 'టీ'

ప్రేక్షకులలో ఒకరిని వచ్చి స్టౌ మీద టీ పెట్టమని చెప్పాలి. వారికి పాలు, టీపొడి మాత్రమే ఇచ్చి అవి మరిగిన తరువాత ఒడపొయ్యటానికి తెల్లని పరిశుభ్రమైన గుడ్డనొకదాని నందించాలి. ఆ టీని త్రాగితే తియ్యగా నుంటవి.