ఈ పుట ఆమోదించబడ్డది
విత్తులు చల్లిన యెడల 5 నిమిషాలలో తామర తీగెలు, పూలు కూడా ఆ చెరువునందు సాక్షాత్కరించి ప్రేక్షకులను విస్మయ సంధ్రమాలలో ముంచివేయగలవు.
పది నిమిషాల్లో మామిడిచెట్లు పుట్టుట
బాగా పండి రాలిన మామిడి పండ్ల నుండి - ఎంగిలి తగలకుండా టెంకలనుతీసి, వాటికి సన్నని రంధ్రములువేసి, ఊడుగ నూనెలో పది రోజుల వరకు నానబెట్టి వుంచాలి. అ తరువాత వాటిని దీసి, యెండించి, భద్రపరచి వుంచుకోవాలి. ప్రదర్శన సమయంలో ఒకచోట మెత్తనిమట్టి కుప్పగాపోసి, ఒక మామిడి టెంకను అందు బెట్టి, మట్టిబాగా తడిసేవిధంగా నీళ్ళు చల్లిన యెడల పది నిమిషాలలో మామిడిచెట్టు పూత, పిందెలతో సహా మొలుచుకు వస్తుంది. ఈ వినోదం తిలకించిన ప్రేక్షకులు ఆనంద పారవశ్యంతో మునిగి, హర్షధ్వానాలు గావించగలరు.[1]
- ↑ * ( పై ప్రదర్శనవలెనే దానికి ముందు, దానికి తరువాత కూడా కొన్ని సందర్భాలలో ఊడుగ విత్తుల తైలముతో చేయవలసిన ప్రక్రియలున్నవి. ఇంద్రజాల ప్రదర్శకులకు ప్రాణప్రదమయిన ఈ నూనెను తయారు చేయు విధానములను మాచే ప్రచురించబడిన "ఇంద్రజాల రహస్యాలు" అను గ్రంథమునందు చూడగలరు. వెల. రు. 6/-