పుట:Mahendrajalam.djvu/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పీటపై నీళ్ళు కాచుట

ఒక పీటవేసి నిప్పు సహాయం లేకుండా దానిపై గిన్నెపెట్టి, గిన్నెలో నీరుపోసి వేడిచేసి, చూపించగలనని ప్రేక్షకులకు చెప్పాలి. తరువాత ఒక చిన్న జర్మన్ సిల్వర్ గిన్నెను దెచ్చి (క్రొత్తది) ఆ పీటమీద పెట్టాలి. అ తదుపరి దానిలో కొంచెం వెలితిగా నీరుపోసి అందులో పాదరసం, మైలుతుత్తం సమభాగాలుగా వెయ్యాలి. కొద్దిసేపు ప్రేక్షకుల్ని - మాటల ద్వారా ఆనందపరుస్తూ గడిపితే, సుమారు పది పదిహేను నిమిషాలలో ఆ నీరు సల సల కాగి ఆవిరి వస్తుంది. గిన్నెకూడా - వెచ్చపడుతుంది. అది చూచిన ప్రేక్షకులు ఆశ్చర్యానందంతో మునిగిపోతారు.

ప్రదర్శకుడు ముందుగా గిన్నెలోపోసేనీటిలో అంతకు ముందే - పాదరసం, మైలుతుత్తం భాగాలకు సమానముగా, ఉప్పు కలిపి వుంచుకోవాలి.

[ఇది రసవాదంలో - పాదరసాన్ని బంధించడాని కుపయోగించే ప్రక్రియ.]

క్షణంలో చెరువులో తామరపూలు

తామర గింజలను మంచివిగా ఏరితెచ్చి, వాటిని ఊడుక గింజల నూనెలో పది - పన్నెండురోజుల వరకు నాన బెట్టిన తరువాత ఎండించి భద్రపరచాలి. వినోదం చూపదలచినప్పుడు - అంతకుముందు తామర తీగెలు లేని చెరువులో ఈ