పుట:Mahendrajalam.djvu/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఎంతగీసినా మండని అగ్గిపుల్లలు

ప్రదర్శకుడు ముందుగా సోడియం సిరికేట్‌లో అగ్గి పుల్లలను ఒకటికి నాలుగుసార్లు ముంచితీసి, ఆరబెట్టి వుంచుకోవాలి.

ప్రదర్శన సమయంలో ఈ అగ్గిపుల్లలను ఎంత గీచినా మండవు.

సిగరెట్ అంటించకుండానే పొగలు

ప్రదర్శకుడు ముందుగా ఒక గాజుగ్లాస్‌లో "హైడ్రో క్లోరిక్ యాసిడ్" రెండుచుక్కలు వేసి - ఆ గ్లాస్‌లో అంటించని సిగరెట్ (చుట్ట, బీడి అయినా పరవాలేదు) వేసి గ్లాస్ పైన పెట్టే మూతలో రెండుచుక్కలు "అమ్మోనియం"ను వేసి - గ్లాస్‌పైన బోర్లిస్తే, ఆ చుక్కలు గ్లాస్‌లో వున్న యాసిడ్‌తో సంయోగము చెంది పొగలు వస్తాయి.

ఇది ప్రదర్శించువారు సమయానుకూలముగా మాటలాడుచూ చూచువారికి అనుమానము లేకుండా చాకచక్యంగా మెలగాలి.

లెక్కచెప్పకుండా శేషసంఖ్యను చెప్పటం

ఈ ప్రదర్శన - చాలా సునాయాసముగా చేయాడానికి వీలయినది. ప్రదర్శకుడు ప్రేక్షకులలోనే ఎవరినయినా పిలిచి - అతని కిష్టమయిన సంఖ్యను కోరుకోమని చెప్పాలి.

అతను కోరుకున్న సంఖ్యను రెట్టింపు చేయమనాలి. అలా రెట్టింపు చేసిన సంఖ్యకు మరో పదహారు కలిపి కూడమనాలి