Jump to content

పుట:Mahendrajalam.djvu/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రం కలిపి వుంచుకోవాలి. ప్రదర్శనలో ఆ నూనె అందరకు చూపిన పొయ్యిమీదపెట్టి కాచినచో అచ్చమయిన నెయ్యిలాగా ఘుమఘుమలాడును. దీనిలి తినినచో నెయ్యివలె రుచి గలిగి వుండును.

నూనెతో పాలు తయారు చేయుట

ఇంద్రజాలికుడు ముందుగా ఉత్తరేణి వేరు (సమూలము)ను తెచ్చి - ఎండలో ఎండించిన తరువాత దానిని బూడిద అయ్యేంత వరకు బాగా కాల్చాలి. 100 గ్రాముల బూడిదలో - 200 గ్రాముల నీరుపోసి, మూడురోజులు దానిని కదలకుండా వుంచి. నాలుగోరోజు బాగా కవ్వముతో మజ్జిగలా చిలకాలి. ఆ తరువాత నాలుగు రోజులు కదపకుండా వుంచి దానిపైన తేరుకొని (తెట్టకట్టుకొని) వున్న నవనీతాన్ని జాగ్రత్తగా తీసి, ఎండపెడితే - అతి సున్నితమయిన పౌడర్ తయారవుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ పౌడర్‌ను నూనె (మంచినూనె. నువ్వులనూనె, ఆముదము ఏదైనా పరవాలేదు) లో చిటికెడు వేసి కలియబెడితే, ఆ నూనె పాలు లాగా అవుతాయి.

అగ్గిపెట్టె లేకుండా ఉప్‌మని ఊదితే మండే అగ్గిపుల్లలు

సల్ప్యూరిక్ యాసిడ్‌లో అగ్గిపుల్లలను ఒకటికి నాలుగుమార్లు ముంచితీసి ఆరబెట్టాలి. ప్రదర్శన సమయంలో ఈ అగ్గిపుల్లను తీసుకొని ఉఫ్‌మని ఊదితే మండిపోతుంది.