పుట:Mahendrajalam.djvu/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పొయ్యి మీద మూకుడు గాని, భాండీ (ఇనుపపాత్ర) గాని నూనె పోసి పెట్టాలి. ఆ తరువాత పొయ్యిలో చమురులో (కిరోసిన్, నువ్వులనేనె, స్పిరిట్ ఏదైనా పరవాలేదు) తడిపిన వత్తులను వేసి, అగ్గిపుల్ల గీసి, ఆ వత్తులను ముట్టించాలి. భాండీలోని నూనె ఫెళఫెళ కాగే వరకు మంట పెట్టినా తలపై పొయ్యి పెట్టిన వ్యక్తికి ఎలాంటి ప్రమాదము కలుగదు.

కొలిమిలో ఎర్రగా కాల్చిన లోహపు వస్తువును నోటితో పట్టి లేపుట:

1 కిలో లేక 2 కిలోల లోహపు గుండును ఇనుము, రాగి, ఇత్తడి, వీటిలో ఏదైనా పరవాలేదు) కొలిమిలో బాగ ఎర్రగా కాల్ల్చి, దానిని బయటికి తీసిన తరువాత నోటితో పట్టుకొని వైకి లేపి, ప్రేక్షకులకు చూపగానే వారు అమిత ఆశ్చర్యాన్ని పొందుతారు.

కాలిన లోహమును నోటితో పైకి లేపే ముందుగా ఇంద్రజాలికుడు హరిత మండూక తైలము (పచ్చ కప్ప క్రొవ్వు)ను రెండు పెదవులకు, నోటిలోని మొత్తం భాగాలకు (నాలుక, పళ్ళు, చిగుళ్ళు మొ|| ) దట్టంగా పట్టించాలి. ఆ తరువాత కాలిన వస్తువును పళ్ళతో పట్టుకొని ఎత్తి 1 - 2 నిమిషాలలోనే వదిలి వేయాలి. అంతకన్నా ఎక్కువ కాలము వేడి వస్తువు నోటిలో వుంటే కప్ప క్రొవ్వు కరిగి, నోరు కాలే ప్రమాదమేర్పడగలదు.,