Jump to content

పుట:Mahendrajalam.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నెత్తిమీద పొయ్యి పెట్టి నీరు కాచుట

ఈ ప్రదర్సనను చాలా జాగ్రతగా చేయవలెను. ముందుగా తములపాకులు, ఏనుగు మలము (విసర్జనము), రాతిసున్నము కలిపి వాటిని నీరు తగలకుండా మెత్తగా (మైనంలాగా) నూరి వుంచుకోవాలి. తరువాత తలమీద పెట్టే విధంగ ఒక పొయ్యి (సుమారు 5 - 6 అంగుళాల ప్రమాణంలో) చేయించాలి. పైన చెప్పిన పదార్థముతో మూడు ముద్దలను చేసి పొయ్యికి అడుగు భాగంలో మూడు పక్కలా అంటించాలి. తదుపరి ఆ పొయ్యి ఏనుగు మూత్రము తో బాగా తడిపి, ఆరబెట్టి ఎండించుకోవాలి. ఆ తరువాత సన్నని డబ్బా రేకుతో సన్నగా 'చుట్టు ' [కడవలు - కుండలు పెట్టుకొనే కుదురు] చేయించుకొని ఆ రేకు చుట్టు కనపడకుండా గుడ్డలు చుట్టాలి. కుదురుకు గుడ్డలు చుట్టే ముందు కలబంద చెట్టును తోళ్ళుతీసి, రేకు చుట్టూతా చుట్టటం మరచి పోవద్దు. పైన చెప్పినవన్నీ ముందు సిద్ధము చేసుకొన్న తర్వాతనే ఈ ప్రదర్శన చేయవలెను.

ప్రదర్శకుడు ప్రేక్షకులతో నా మహిమతో నెత్తిమీద పొయ్యి వెలిగించి నూనె గాని, నీరు గాని ఏది కావాలంటే దానిని కాచి ఇస్తాను. కాని తలకు ఎలాంటి ప్రమాదము వాటిల్లదని చెప్పి, ప్రేక్షకులలో ఎవరినైనా రమ్మని పిలిచి శిరస్సు పై సిద్ధంగా వుంచుకున్న కుదురు {చుట్టు] ను వుంచి, దాని మీద పొయ్యి [ సిద్ధంగా వుంచుకొన్న]ని పెట్టి - ఆ