పుట:Mahendrajalam.djvu/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ చివరా, ఈ చివరా [బయట వైపులు] ఎత్తుగా వుంచి పీట మధ్య భాగంలోకి రెండు వైపుల నుండి క్రమేపి ఏట వాలుగా [కనిపించనంత తక్కువగా] వచ్చేటట్లు చేయించు కోవాలి. పైన చెప్పిన విధంగా ఒకటి కాకుండా - రెండు రాగి నాణాలను శుభ్రపరచి - పీటకు ఆచివరా ఈ చివరా పెట్టి వాటిమీద కర్పూరం వెలిగిస్తే - అటునుండి ఆ దీపం, ఇటు నుండి ఈ దీపం ప్రయాణించి - పీట మధ్యలోకి వచ్చి ఒకటిగా కలసి [సంగమించి] పోతాయి. ఇది చూడటానికి చాల ఇంపుగా వుంటుంది.

ఈ విధంగానే నాలుగు దీపాలు సంగమిస్తున్నట్లుగా కూడ చేయ వచ్చు. ఆ విధానం ఈ పాటికే మీకు అర్థ అయివుంటుంది కదూ.

ఆకు దొన్నెలో నీళ్ళు కాచుట

ఒక అరటి (ఏ చెట్టు ఆకు అయినా పరవాలేదు. ఉదా: బాదం, తామర, మఱ్ఱి మొదలగునవి] ఆకును తెచ్చి దానికి రెండు వైపులా కప్ప కొవ్వును బాగా పట్టించి ఆర బెట్టి వుంచుకోవాలి. ప్రదర్శించే సమయంలో ప్రేక్షకుల ముందే ఆకును, దొన్నెగా కుట్టాలి. ఆ దొన్నెలో నీరు పోసిన తరువాత దొన్నె పై భాగమందా స్పిరిట్ ను బాగా పట్టించి అగ్గి పుల్ల గీయగానే దొన్నె భగ్గున మండి పోతుంది. కాని ఆకు దొన్నె కాలదు. నీరు వేడిగా వుంటుంది.