పుట:Mahendrajalam.djvu/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గొట్టంనుండి గుండు బయటకు వచ్చే శబ్దాన్ని కలిగిస్తూ స్టీం బోట్ లా నీటిలో ప్రయాణిస్తుంది. అద్భుతమయిన ఈ ప్రక్రియ చూపరులకు ఎంతో ఉద్వేగాన్ని, ఉత్సాహాన్ని కలిగించును.

ప్రయాణించే దివ్య దీపం

ప్రదర్శకుడు ముందుగా టేకు చెక్కతో తయారు చేసిన నునుపయిన (బాగా పాలీష్ చేసినది) పీటగాని, బల్ల గాని తీసుకు రావాలి. తరువాత మైనం కరగించి.. ఆ చెక్క మీద పోసి ఇంకా బాగా నున్నగా వచ్చేటట్లు పరిశుభ్రంగా తుడవాలి. ఆ చెక్క ఒక వైపు కొంచెం పల్లంగా (చాలా స్వల్పంగా) ఉండేటట్లు చేసుకోవాలి. ఆ తరువాత ఓక రాగి నాణెమును పరిశుభ్రంగా (చిలుము లేకుండా ) మెరసి పోయేటట్లుగా తోమి వుంచుకోవాలి.

ప్రదర్శన సమయములో సిద్ధంగా వుంచుకొన్న పైన చెప్పిన పీటమీద (ఎత్తువున్న వైపు) ఈ రాగి నాణాన్ని పెట్టి దానిమీద చిన్న కర్పూరపు గడ్డ పెట్టి వెలిగిస్తే - ఆ రాగి నాణెం ఒకరి ప్రమేయం లేకుండా తనంతట తానే మెల్లగా పల్లం వైపుకు ప్రయాణం చేస్తుంది. ఇది చూచు వారికి - చాల విచిత్రంగా వుంటుంది.

కర్పూర దీపాల దివ్యసంగమం

ఈ ప్రదర్శన - పైన చెప్పిన (ప్రయాణించే దివ్య దీపం) దానిలి చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. పీటకు