పుట:Mahendrajalam.djvu/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

నందు [సెనగపులుసు అయిన పరవలేదు] వేసి. పది పదిహేను రోజులు నానబెట్టాలి. అప్పుడు గ్రుడ్డు పై భాగంలో - వుండే పెంకు మెత్తబడి [తోలు గ్రుడ్డులా] పొతుంది. అలా మెత్తబడిన వాటిని దీసి -సీసాలోనికి మెల్లగా నెట్టాలి. ఆ తర్వాత చల్లని నీరు పొసిన వెంటనే మెత్తబడిన గ్రుడ్ల పై పెంకు గట్టిపడిపోతుంది. చూచేవారికి ఆ గ్రుడ్డ్లు సీసాలోకి ఎలా వెళ్ళాయో అర్ధంగాక - ఆలోచించినా, ఆ ఆలోచనకు అందక ఆశ్చర్యపోతారు.

కోడిగ్రుడ్డు భయంకర శబ్దం చేస్తూ నీటిలో ఈదుట

ప్రదర్శకుడు ముందుగా ఒక కోడిగ్రుడ్డును(పక్షిజాతి గ్రుడ్డు ఏదయినా పర్వాలేదు) తీసుకొని చిన్న బెజ్జంవేసి-దానిలోపల వుండే పదార్థం (పచ్చసొన, తెల్లసొన) మొత్తం తీసివేయాలి. తరువాత దాన్ని ఎండలో - తడి లేకుండా బాగా ఆరబెట్టాలి. ఆ తరువాత రాళ్ళ సున్నము, గంధకము తెచ్చి విడివిడిగా మెత్తని పౌడర్ లాగ నూరాలి. గంధకము, సున్నములను సమపాళ్ళలో కలిపి, ఆ పౌడరును ఎండబెట్టిన అండం బెజ్జంలో నుండి జాగ్రత్తగా గ్రుడ్డు పగలకుండా కూర్చి, తరువాత ఆ బెజ్జాన్ని తెల్లని కాగితంతో కనిపించని విధంగా అంటించాలి. చూచు వారికి అనుమానం రాకుండా అంటించిన గాగితం కొసలకు మైనం రాసి నునుపుగా రుద్దాలి. ఆతరువాత అప్రదర్శన సమయములో ఈ గ్రుడ్డును నీటిలో వేసిన - తుపాకి