పుట:Mahendrajalam.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మ కప్పకు ప్రాణప్రతిష్ట

ప్రదర్శకుడు-- తనవద్ద సిద్ధముగా వుంచికొన్న కప్పబొమ్మనుచూపి, "దీనికి నా మంత్ర బలముతో ప్రాణం పోస్తాను " చూడమని చెప్పి కొంచెం సేపు ధ్యానించి [అలా నటించి ] ఆ బొమ్మను తీసుకొని, సాంబ్రాణి ధూపం వేసి, బొమ్మను క్రింద పెట్టగానే దానికి ప్రాణం వచ్చి ఎగిరెగిరి పడుతుంది. ఈ వింత చూచిన ప్రేక్షకులు ఎంతో ఉద్వేగం చెంచుతారు.

ఈ ప్రదర్సనికి ముందుగా - చిన్న ఇనుప గోలి గాని, పెట్టె లాంటిది గాని [తాయెత్తు అయినా పరవాలేదు] తీసుకొని దానిని పాదరసంతో నింపి- మైనంతోగాని, లక్కతో గాని మూతిమూసివేసి దానిని బొమ్మ కప్పకు క్రింద భాగంలో దారంతో కనిపించకుండా కట్టాలి [మైనంతో గాని, లక్కతో గాని, అంటించవచ్చు] ధూపం వేసేటప్పుడు బాగా వేడి తగిలేటట్లుగా - కాసేపు వుంచి క్రింద, పెడితే - లోపలి పాదరసం వేడికి వ్యాకోచించి కదులుతుంది. ఆ కదిలే సమయంలో కప్ప కూడ ఎగెరెగిరి పడుతుంది. అది వేడి వున్నంత వరకే ఇలా ఎగురుతుంది.

ఈగలు పారిపోవుట

ఈగలు మెండుగా వుండే [జూన్, జూలై] సమయాల్లో మాత్రమే ఈ ప్రదర్శన బాగా రక్తి కడుతుంది. ఈగలను చూచి ప్రదర్శకుడు చిరాకుతో ఈ మహా మాంత్రికుడంటే ఈగలకు సరిగా తెలియదు. చూడు మిమ్ములను ఏం చేస్తానో అని తన దగ్గర అంతకుముందే సిద్ధంగా వున్న తాళకము