Jump to content

పుట:Mahendrajalam.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొక్క పొడిని [సాంబ్రాణిలో కలిపి వుంచుకోవాలి] నిప్పుల పై విసరికొట్టి మంత్ర ధ్యానం (నటన)లో మునిగి పోవాలి. అలా కొంచెం సేపు వుండి కనులు తెరిచి, చూసే సరికి ఒక్క ఈగకూడ లేకుండా పోతుంది. అది చూచిన వారు ఇతని శక్తికి చాల ఆశ్చర్య పడతారు.

ఊస్తే ఉమ్ము - మంటలు భగ్గున!

ప్రదర్శకుడు సభికులతో నేను గొప్ప మహిమాన్వితుడను. ఎంత గొప్ప వాడినంటే నేను ఉమ్మి ఊసినా సరే భగ్గున మంటలు పుడతాయి. చూడండి నా మహా శక్తి అని చెప్పి గడ్డిమీదో లేక కర్పూరము మీదో, గుడ్డ మీదో సమయానుకూలంగా ఊసిన వెంటనే - ఉమ్మిపడిన ప్రాంతంలో ఉన్న పదార్థాలు భగ్గున మండి పోతాయి. ఈ ప్రదర్శన తిలకించిన వారు ఊపిరి సలపనంత ఆశ్చర్యం పొందుతారు.

ఈ ప్రదర్శనకు ముందుగా ఇంద్ర జాలికుడు - గౌఠీపాషాణము (వైట్ ఫాస్పరస్) ను ఆవగింజ పరిమాణం పుల్లతో తీసుకొని, నాలిక క్రింద గాని, దవడ ప్రక్క గానీ పెట్టుకొని, సమయం వచ్చినప్పుడు ఉమ్మితో పాటు దానిని కూడ లక్ష్యము పైన ఊయ వలెను. తడి ఆరిన వెంటనే అది మండి పోయి ప్రక్క పదార్థములను కూడ మండిస్తుంది. ఈ వైట్ ఫాస్పరస్ ను ఎప్పుడూ నీళ్ళలోనే వుంచాలి. బయటకు తీయగానే ఆరిపోయి తనంతట తానే మండి పోయే గుణముగల దీనిని తెల్ల భాస్వరమని చాల మంది అంటారు.