పుట:MaharshulaCharitraluVol6.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుక్రమహర్షి

91

ఇట్లు శుక్రాచార్యుఁడు నిజశిష్యులచేతనే ఘోరావమానమునకుఁ. బాల్పడి రాక్షసవంశములు నాశనము లగుఁగాక యని శపించి తనబిడ్డలతోఁ దపోవనమునకు వెడలిపోయెను. "పిల్లి శాపమునకు ఉట్లు తెగి క్రిందఁ బడునా? దొంగవాఁడు కపట నాటకమాడి మనలను శపించిన, ఆ శాపము మనకు సోఁకునా?" యని బృహస్పతి రాక్షసులకు నమ్మఁబలికి వారిని విజయవంతముగా మోసగించెను.

రాక్షసులకు వైదికమతవిశ్వాసముఁ బోఁగొట్టినఁగాని వారు శాశ్వతముగా నాశము కారని యెంచి యిదే యద ననుకొని బృహస్పతి రాక్షసు లండఱఁ బిలిచి వేదబాహ్య మగు ఆర్హత మతమును వారికిఁ జక్కఁగా బోధించి వారి కది బాగుగా నొంటఁబట్టినపిమ్మట వారి నందఱను యమునాతీరమునకుఁ గొనిపోయి స్నాతులఁ జేయించి ఆర్హ మత వేషముల ధరింపఁజేసి "ఆర్హ తాయ నమో" అన్నమంత్ర ముపదేశించి వారిని వేదబాహ్యులను. కర్మభ్రష్టులను పరిపూర్ణముగా నొనరించి రహస్యముగా దేవలోకమునకుఁ బోయెను. దేవతలు వెంటనే యుద్ధము ప్రకటించి రాక్షసులను ముప్పుతిప్పలఁ బెట్టి మూఁడుచెఱువులనీళ్ళు త్రాగించి తుక్కుతుక్కుగ నుక్కడఁగి. చిరి. అప్పటికి వారికి జరిగిన మోస మంతయుఁ దెలియవచ్చెను. చేతులు కాలినపిదప నాకులు పట్టిన నేమిలాభము ?

రాక్షసు లందఱును శుక్రాచార్యుని వెదకికొనుచుఁ బోయిపోయి తుద కాతనిఁ గాంచి పాదములఁ బడి తమ్ము క్షమించి పురికి విచ్చేయుమని ప్రార్థించిరి. ఆతఁడు వారిని గంటనై నఁ గనక, మాటయై న మాటాడక గర్హించి పాఱఁదోలెను. "ఉభయ భ్రష్టత, ఉపరి సన్న్యా సము " అన్న నానుడి రాక్షసులకుఁ బూ ర్తిగా వర్తించెను. అపుడు వారు గోలుగోలున నేడ్చుచుఁ దాము పడ్డ మోసమునకుఁ చేసినమోసమునకు లెంపలు వై చుకొని పశ్చాత్తాపపడి ప్రహ్లాదునికడ కేగి రక్షింపుమని యాతనిపాదముల పైఁ బడిరి. దయార్ద్రహృదయుఁ డగు నా మహానుభావుఁడు రాక్షసపురస్కృతుఁడై శుక్రాచార్యులపాలి కేగి రాక్షసకుల మొనరించిన మహాపరాధమును మన్నించి కాపాడు మనియు, బృహస్పతి