పుట:MaharshulaCharitraluVol6.djvu/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మృగశృంగమహర్షి

79


సుమతి సుమతి యనుమునికూఁతురగు సత్యను, సువ్రతుఁడు పృథు పుత్త్రిక యగు, ప్రియంవదను బరిణయమాడి గృహస్థులై రి.

మృగశృంగుఁడు మోక్షమందుట

మృగశృంగమహర్షి యట్లు పుత్త్ర స్నుషా సహితుఁడై సకల సౌఖ్యము లనుభవించి మాఘమాసములం దుషఃస్నానములంజేయుచుఁ దపోవ్రతమును నడపెను. ఆ పిదప విరక్తి జనింప నాతఁ డెల్ల రను విడిచి తపోవనమున కేఁగి సర్వభూతములను ఆత్మసామ్యమునం గనుచు మృగములతోఁ గలిసి నిర్భయముగఁ జరించుచుఁ బరమశాంతి యుతుఁడై కాలము గడపెను.

అంత్యకాలమున మృగశృంగమహర్షి ఆశ్రమమునఁ దనశరీరమును ద్యజించి బ్రహ్మపదమును గాంచి ప్రళయకాలము వఱకు సుఖముగా నుండి యా పిదప శ్వేతవరాహకల్పమున అజపుత్రుఁడుగ ఋభు వనుపేర భూలోకమున జనించి నిదాఘుఁ డనువాని నుద్దరించి తుదకు మోక్షసామ్రాజ్యమును జూఱగొనెను.

ఆ పిమ్మట మృకండుఁడు తనకు సంతానము కలుగని కారణమునఁ దల్లులతోడను భార్యతోడను బయలుదేఱి విశ్వేశ్వర రాజధాని యగు కాశీపట్టణమును జేరి గంగాస్నానాదికృత్యములను యథావిధిగ నొనర్చి డుంఠివిఘ్నేశ్వరునిముందుఁ దనపేర శివలింగమును బ్రతిష్టించెను. దానిముందు సువృత్త సువృత్తేశ్వరలింగమును, దానికిఁ దూర్పు దెసను కమల కమలేశ్వరలింగమును, విమల విమలేశ్వరలింగమును. సురస సురసేశ్వరలింగమును, మరుద్వతి మణికర్ణికకుఁ బడమటి దిక్కుగా మరుద్వతీశ్వరలింగమును బ్రతిష్ఠాపించిరి.

మృకండీశ్వరుని దర్శించుటవలన సర్వకార్యసిద్ధి, కాశీవాసమును; సువృత్తేశ్వరుని దర్శించుటవలన సద్వృత్తి, నిర్విఘ్నతయును; కమలేశ్వర దర్శనమున సర్వకామసిద్ధియు; విమలేశ్వర దర్శనమున విమలజ్ఞాన ప్రాప్తియు; సురసేశ్వర దర్శనమున సుర సామ్రాజ్యలాభమును కాశీ