పుట:MaharshulaCharitraluVol6.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

మహర్షుల చరిత్రలు


బ్రహ్మచర్యమున ఋషుల సంతోష పెట్టితివి. ఇట్లే యజ్ఞములచే దేవతలను సంతానముచే పితృదేవతలను సంతోషపెట్టుము." వత్సుఁ డమితానందమంది పరమేశ్వరుని యవ్యాజవాత్సల్యమున కంజలి ఘటించి యాతని నా తీర్థమున నిలిచియుండఁ బ్రార్థించెను. శౌరి యట్లే యని యాతని ననుగ్రహించి యదృశ్యుఁ డయ్యెను.

మృగశృంగుఁ డింటి కేఁగి తలిదండ్రులకు జరిగిన సంగతి యంతయుఁ దెలియఁజెప్పి వారి నానందపఱిచి వారికి సేవచేయు చుండెను. కుత్సుఁ డొకనాఁడు తనమిత్రుఁడైన ఉతథ్యునకుఁ దన పుత్రుని వృత్తాంతము:ను వినిపించెను. ఆతఁ డమితానంద మంది తన కూఁతురు సువృత్త యనునామె మూఁడు సంవత్సరము లట్లే మాఘమాసస్నాన మాచరించి వ్రతము సలిపె నని వివరించి సువృత్తను వత్సున కిచ్చి వివాహముచేయ నూహించెను. కుత్సుఁ డాతనియూహ గ్రహించి తనపుత్త్రున కాతనిపుత్తి క నిమ్మని ప్రార్థించెను. ఉతథ్యుఁడు తప్పక యిచ్చెద నని వాక్రుచ్చెను. ఆనందాతిశయమునఁ గుత్సుఁ డింటి కేఁగి సుతుఁ డగువత్సునకు జరిగిన సంగతిఁ దెలిపెను. వత్సుఁడును దనయంగీకారమును దెలిపెను.

కాని, దైవవశమున నింతలో నొకమహావిపత్తు సంభవించెను. ఒకనాఁ డరుణోదయమున సువృత్త మువ్వురు చెలికత్తెలతోఁ గూడి కావేరీస్నాన మొనరించి తిరిగి వచ్చుచుండఁగా, నొకమదగజము పరుగు పరుగున వారిపైకి రాఁజొచ్చెను. దానిం గని యడలిపోయి పరుగెత్తుచుండఁగాఁ బ్రమాదవశమున నొక పాడునూతఁ బడి సువృత్త చెలికత్తెలతోఁ గూడ మరణించెను. ఈ దుర్వార్త శరవేగమున వచ్చి కొందరు వత్సునకుఁ దెలిపిరి. వత్సుఁడు వారిని బ్రదికింతు ననియు పారిశరీరములను జాగ్రత్తగాఁ గాపాడుచుండుఁ డనియుఁ దెల్ఫి యా వార్త దెచ్చినవారిని బంపి తాను సహ్యజ కేఁగి యందు కంఠముదాఁక నీటిలో నిలఁబడి యేకాగ్రతతో మృత్యుదేవతనుగూర్చి జప మొనరించుచుండెను.

ఇంతలో మదగజము పరుగుపరుగున వచ్చి యా మునిని సమీపించి తనతొండముతో నాతని నెత్తుకొని నెత్తి నిడుకొనెను. వత్సుఁ డడ