Jump to content

పుట:MaharshulaCharitraluVol6.djvu/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంకణమహర్షి

73


"తాను జేసిన ధర్మంబె తన్నుఁ గావ
 వలయుఁగాని మఱొక్కఁ డెవ్వఁడును రాఁడు
 కంఠమునఁ జుట్టి పాశంబుఁ గాలభటులు
 కనికరము లేక లాగెడి కాలమందు ”
                               పద్మ. పాతాళ. 2245

అని పలికెను.

ఆకథుఁ డా పలుకుల కానందించి “గృహస్థ ధర్మమతిథి పూజ. కావున, ముందు మన మతిథికిఁ గడుపునిండఁ బెట్టి తద్భుక్త శేషాన్న మేమైన నున్నచో మనసంగతి చూచుకొందము. నీవు సర్వము సిద్ధము చేయు" మని భార్య కాదేశించి యతిథిని లోనికిఁ గొనివచ్చి పీఁట వేసి కూర్పుండఁ బెట్టఁగా నామె పాత్ర యుంచి యం దన్న మంతయు వడ్డించి భుజింపఁ బ్రార్థించెను. ఆ దంపతుల యతిథిపూజా విధానమున కత్యంత మలరి యా యతిథి శివుఁడై నిలిచెను. ఆ దంపతు లాతని పాదములఁ బడి యాతని పదపంకజభక్తి నిమ్మని ప్రార్థించిరి. శివుఁడు వారి కా వర మనుగ్రహించి యదృశ్యుఁడయ్యెను.*[1]


  1. *పద్మపురాణము, పాతాళఖండము.