పుట:MaharshulaCharitraluVol6.djvu/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంకణమహర్షి

69


విన్న బ్రహ్మ ఋషులయెడ దయాళువై సరస్వతిని స్మరించెను. వెంటనే సరస్వతి ప్రత్యక్షమై 'సుప్రభ' యను పేర నటఁ బ్రవహించెను. మహర్షు లెల్లరు నానంద భరితులైరి.

తరువాత, నైమిశారణ్యమునులు సత్ర యాజులై తన్నుఁ బ్రార్థింపఁగా సరస్వతి వచ్చి " కనకాక్షి ' యను పేర నటఁ బ్రవహించి వారికి సంతోషమును సమకూర్చెను.

మఱియొకప్పుడు గయుఁ డనుమహారాజు యజ్ఞముచేయుచు యాగదిక్షితుఁడై యా సరస్వతిని బ్రార్థింప నామె విచ్చేసి కరుణా కటాక్షము మెఱయ గయదేశములఁ దడుపుచు ‘విశాల' యను పేరం బ్రవహించెను.

ఇంకొకప్పుడు ఉద్దాలకుఁ డనుమహర్షి యజ్ఞముచేయుచు మునీంద్రులకుఁ జేతోమోదము కలిగించుకొఱ కామెఁ బ్రార్థింప సరస్వతివిచ్చేసి వల్కలాజినధారు లగు మునివరుల కోరికచొప్పున ‘మనోరమ' యను పేర నటఁ బ్రవహించెను.

తదుపరి, కురుక్షేత్రమున కురువు చేయు యాగవేళఁ బ్రత్యక్షమై సరస్వతి ‘సురేణువు ' లేక ' సురతన్వ' అను పేరఁ బ్రవహించెను.

మఱియొకప్పుడు వసిష్ఠమహర్షి చేయు యజ్ఞమునకుఁ బిలువఁబడి సరస్వతి 'ఓఘవతి' లేక 'ఓఘమాల' యనుపేరఁ బ్రవహించెను.

ఇంకొక్క వేళఁ బరమేష్ఠి చేయు యజ్ఞవేళల విచ్చేసి సరస్వతి 'విమలోదక' 'సువేణి' యను పేళ్ళతో రెండువిధములఁ బ్రవహించెను. ఈ యేడునదులు కలిసినతావే సారస్వత తీర్థము. అదియే మంకణ మహర్షి యేర్పఱుచుకొన్న ఆశ్రమోపాంతప్రదేశము.

మంకణుని మహిమ

మంకణమహర్షి యస్ఖలితవీర్యుడైఁ గౌమార బ్రహ్మచర్యమున నుండఁగా నొకనాఁడు సరస్వతీనదిలో స్నానము చేయుచుండఁగా