పుట:MaharshulaCharitraluVol6.djvu/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

మంకణ మహర్షి

జననము

తొల్లి మాతరిశ్వుఁ డను తపశ్శాలి సుకన్య యనుకన్యను బెండ్లియాడి యామెవలన నొకసుపుత్తుని గాంచెను. అతఁడు మంకణుఁ డనియు, మంకణకుఁ డనియు నామముల నొప్పి, వయసు వచ్చినంతనే తలిదండ్రుల యనుజ్ఞ గైకొని వెడలి సప్తసారస్వత మనుతీర్థప్రదేశమున నాశ్రమమును తపోనిమిత్తము నిర్మించుకొనెను.

ఆశ్రమము

సద్ర్బహ్మచారి, సత్తపః ప్రవణుఁడు నగుమంకణమహర్షి యాశ్రమము నానాద్విజగణ సమన్వితము. అందు బదరములు, ఇంగుదములు, శాశ్మర్య, ప్లక్ష, విభీతక, అశ్వత్థము లను వివిధ వృక్షములు, కంకోలములు, పలాశ, కరీరు, పీలుజాతుల చెట్లును బహుమనోహర భంగులఁ బెరిగి యా ప్రదేశము నతిమనోజ్ఞ మొనర్చెను. అందుఁ బెరిగిన కదళీవనములో జలవాయుఫలపర్ణాహారులు, దంతోలూఖలికులు, అశ్మకుట్టులు, వానేయులు నగుపెక్కు విధముల మునులు జపతపో ధ్యానాసక్తులై నివసించుచుండిరి. వారి యునికి వలన ఆ ప్రదేశము నిరంతర స్వాధ్యాయఘోషతోను, సాధు మృగశతములతోడను, అహింసకులు, పరమ ధర్మపరులు నగుజనములతో నొప్పారుచుండెను.

సప్తసారస్వతము

పూర్వ మొకప్పుడు బ్రహ్మ ఋషీశ్వరుల నెల్ల రిని బిలిపించి సర్వకామసంసిద్ధిదమగు సత్ర యాగము నొకదానిని జేయ సమకట్టెను. ఆ యజ్ఞదీక్షితుఁడై పితామహుఁ డుండఁగాఁ గొందఱు ఋషులు సరస్వతీనది యటఁ బ్రవహింపనిలోపము దక్క నింకేలోపము లేదనుకొనిరి. ఆ మాట