పుట:MaharshulaCharitraluVol6.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృహస్పతిమహర్షి

51


చెద" నని నిశ్చయించుకొని, యైనను వారిని గొంచెము పరీక్షింపఁ దలఁచి యిట్లనెను. "దేవతలారా! దిక్పాలుర వెంటఁబెట్టు కొని మీ యేలిక యగు నింద్రునితో నిట్లు చనుదెంచి సామాన్యుఁడనగు నాకు గొప్పతన మారోపించి గురుత్వము వహింపు మని న న్నర్ధించుట నా యదృష్టము. ఐనను నా కించి ద్జ్ఞతను నేను విన్నవించుకొనుచున్నాను. మీకుఁ దగిన గురువులు నా కంటె మిన్నలు ఎందఱో కలరు. భార్గవుఁడగు శుక్రాచార్యునో భ్రాతృవ్యుఁ డగుసంవర్తమునినో మీ రెన్ను కొనుట యుత్తమము. కాని వారికంటె దీసికట్టును నన్నుఁ గోరుకొను టేమి వివేక?" మని వాదించెను. దేవత లంద ఱొక్క పెట్టున గురుత్వ సామ్రాజ్య సింహాసనము నధిష్ఠించుట కాతని కంటె నధికార్హత గలవా రింకొక్కరు లే రని యందుల కంగీకరింపు మని యాతనిని మఱిమఱి బతిమాలుకొనిరి. తుద కాతఁడు వల్లె యన మహాప్రసాద మని దేవతలు జయజయధ్వానము లొనరించిరి. పిదప దేవతలు దివ్య వైభవముగా దిక్పాలకలు ఇరువై పులఁ గొలువ, అప్సరోవనితలు రాగతాళలయ సంయుక్తముగ నాట్యములు సలుపుచు నడువ, ఇంద్రుని యైరావతమున నింద్రునికి ముం దాసీనునిఁ జేసి మిగిలిన బృందారకులు మందార వృష్టిఁ గురియించుచు నడువ, బృహస్పతిని దేవనగరమునకుఁ గొనిపోయి గురుసింహాసనాసీను నొనర్చి పట్టాభిషేకముచేసి యొక రొకరే యాతని పాదములకు మొక్కిరి.

బృహస్పతి తనకు దేవతలవలన జరిగిన నిరుపమాన గౌరవమున కలరి వారితలలో నాలుకవలె మెలఁగుచుఁ గంటిని ఱెప్పవలెఁ గాపాడుచుఁ దనబుద్ధివై భవమునకుఁ దార్కాణగా వారికిఁ దగుసమయములఁ దగు నాలోచన లొనరించుచు నుండెను.

ఇది యిటు లుండ భృగువంశజుఁ డగుశుక్రాచార్యుఁ డవక్రబుద్ధి విక్రమమున నధికుఁడ నని గర్వించి దేవతలు గురువు నన్వేషించుచున్నా రని విని వారు తప్పక తన కడకే వచ్చి యర్థించి తననే గురువుగా గై కొందు రని యాశించి యుండెను. ఇంతలో దేవతలు బృస్పతిని గురువుగాఁ గైకొని దివ్యవై భవమున నమరావతికిఁ గొనిపోయి పూజించు