పుట:MaharshulaCharitraluVol6.djvu/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

మహర్షుల చరిత్రలు


నిలుపును." ఇట్లు చెప్పి విష్ణు వదృశ్యుఁ డయ్యెను. ఆ పిదప సప్త మహర్షులు ధర్మసంహితబుద్ధు లైరి. కాలక్రమమున బృహస్పతి జన్మించినపిదప సప్తమహర్షులు విచ్చేసి విష్ణుమూర్తి యాజ్ఞ ననుసరించి సకలధర్మశాస్త్ర రహస్యములను బృహస్పతి కుపదేశించి వెడలిరి. బృహస్పతి ఇందువలన బుద్ధిమంతులనెల్ల బుద్ధిమంతుఁ డయ్యెను. *[1]

దేవగురుత్వము

సర్వశక్తిసంపన్నులు, ప్రజ్ఞానిధు లయ్యు దేవతలు తమకుఁ దగినగురువు లేకపోవుటవలనఁ దగినంతగా రాణింపలే కుండిరి. అపుడు దేవత లందఱును తమకు గురువును బడయ లోకము లెల్ల గాలించిరి. భార్గవవంశమువాఁ డగు శుక్రాచార్యుఁడు, ఆంగిరసుఁ డగు బృహస్పతియు నిరువురే లోకమునఁ గల గురువులలో నగ్రేసరు లని తెలిసికొని, వారు చిరకాల మాలోచించి బృహస్పతియే యిరువురియందు మిన్న యని నిశ్చయించుకొనిరి. అపుడు వారందఱును శ్రద్ధాభయ భక్తి వినయవిధేయతలతో విచ్చేసి బృహస్పతి నాశ్రయించి కోటి మ్రొక్కులు మ్రొక్కి, “మహాత్మా! అజ్ఞానాంధకారమును విజ్ఞానప్రకాశమునఁ బటాపంచలు చేయు సుజ్ఞానభాస్కరుఁడే గురువు. గురుకృపాలబ్దమగు విద్యయే శోభించును. ధర్మార్థకామమోక్షములకు, దై నందినవ్యవహార దక్షతకు గురువే పెన్నిధి. చుక్కానిలేని నావవలె గురువు లేని విద్యార్థి కాంక్షాపారమును గాంచనే లేఁడు. విబుధమణి వగు నీవే దేవతలకుఁ దగిన గురుడవు. కావున అవ్యాజకృపాయ త్తచిత్తమున నుత్తమ గురుఁడవై నీవు మాకు శ్రేయ మొనగూర్పు” మని ప్రార్థించిరి.

బృహస్పతి యాలోచించి “బంగారపుఁ బళ్లెమునకైనను గోడ చేరుపు కావలయునుగదా! లేనినాఁ డది శోభింపదు. జగజెట్టులగు దేవతాధిపతులకు గురుత్వము వహించుటకంటె నాకు వాంఛింపఁ దగిన దేమున్నది? నేను గురువు నగుదు నన్న వా రంగీకరించి యుండక పోవచ్చును. వారంతట వారే వచ్చి ప్రార్థించినపు డంగీకరించుటే యుత్తమమార్గము. దేవగురుత్వము నా ప్రజావై భవమునకుఁ దగిన స్థానము. సిరి రా మోఁకా లొడ్డుట యవివేకము. కావున నంగీకరిం

  1. *భారతము శాంతిపర్వము.