Jump to content

పుట:MaharshulaCharitraluVol6.djvu/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

మహర్షుల చరిత్రలు


భీమసేనుని యువరాజపదంబున నిలిపెను. కర్తవ్యవిచార నిశ్చయములకు సంధివిగ్రహాదులకు విదురుని నియోగించెను. ఆయవ్యయాదు లెఱింగించుటకు సంజయు నేర్పఱిచెను. భృత్యుల జితనాతములకుఁ గర్మకలాపములకు నకులు నాజ్ఞాపించెను. దర్పితుల మర్దించుటకు, పరరాజుల జయించుటకు నర్జును నియోగించెను. బ్రాహ్మణ కార్యములకు శ్రౌతస్మార్త కృత్యానుష్ఠానములకు ధౌమ్యు నేర్పఱిచెను. నిరంతర పార్శ్వవ ర్తిగా సహదేవు నుంచుకొనెను. సమస్తవైదికకర్మ దానధర్మాదులకు ధౌమ్యునికి సర్వాధికారము లొసంగెను. అంతేకాదు. ధర్మరాజు ధౌమ్యునకు సగౌరవముగా సకల సంపదల నిచ్చి యాతనివలన దేవ పితృ పూజనములు, అతిథి తర్పణములు, వై దేశిక విప్రార్చనములు దీనానాథపోషణములు పరమసంతోషముతో నిర్వర్తింపఁ జేసెను.

ఈ విధముగా మొదటినుండి తుదివరకు ధౌమ్యమహర్షి పాండవ పౌరోహిత్య మద్భుతముగ నెఱపి సకలజన జేగీయమానుఁడై ముక్తి నందెను.*[1]



  1. *భారతము ఆదిపర్వము. అరణ్యపర్వము, విరాటపర్వము, శాంతిపర్వము.