పుట:MaharshulaCharitraluVol6.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధౌమ్యమహర్షి

47


పూజ గావించెను. అంతఁ బాండవులు పాంచాలితోఁ గూడి అగ్నిహోత్రునకు, పురోహితునకు ప్రదక్షిణ నమస్కారము లొనరించి ధౌమ్యునితో బయలుదేరి వెడలిరి. వా రట్లు చని చని తుదకు విరాటరాజు పట్టణము పొలిమేరలు చేరఁగనే ధౌమ్యుని వీడ్కొని ముందున కేగిరి. ధౌమ్యుఁడును దన కర్తవ్యమును నిర్వర్తించి తన పుణ్యాశ్రమమున కేగి వసించెను.

ధౌమ్యుఁడు ధర్మరాజు పట్టాభిషేకంబు గావించుట

తుదకు భారతఘోర రణమున విజయమును సాధించి కృష్ణుని నియోగమున బ్రాహ్మణ ప్రేరణమున ధర్మరాజు పట్టాభిషేకమున కంగీకరించెను.

పిదప సర్వసంభారములు సమకూరినతరువాత ధౌమ్యమహర్షి కృష్ణు ననుమతిఁ గొని తూర్పు పశ్చిమములకు వేదిక నలంకరించి నవరత్నఖచితము దృఢపాదము నగు భద్రపీఠమును బ్రతిష్టించి పులి చర్మముఁ గప్పి పూజించి దానిచుట్టు బంగారము, వెండి, రత్నములు మున్నగు వానితో నిండిన కుంభము లమర్చి వాని నిండ గంగాది పవిత్ర నదులనుండి కొనితెచ్చిన జలములను బోసి యన్నింటికి రత్నమంగళ తరుత్వక్పల్లవ కుసుమములను, పంచగవ్యములను సమంత్రకముగా సంస్కరించి మహా మంత్రములు చదువు బ్రాహ్మణ పుంగవులతో ధర్మజుని దీసికొనివెళ్లి యా పీఠమునఁ గూర్చుండఁబెట్టి శుభాలంకృతులతో నభిరామయై యొప్పు ద్రౌపదీదేవిని బ్రక్కఁ గూర్పుండఁబెట్టి అగ్నిహోత్రు నాముఖము చేసికొని హోమమంత్రములు చదువుచు శుభముహూర్తవేళ కాఁగానే కృష్ణుని లెమ్మనెను. శంఖచక్రధరుఁడగు నతఁడు శంఖమె త్తి పృథివి కధిపతి వగుమని ధర్మరాజున కభిషేకము కావించెను. అంత వ్యాసభగవానుఁడు ముందునకువచ్చి ప్రతిష్ఠిత కలశములలో నుజ్జ్వలమైనదానిని ధౌమ్యుఁ డందీయఁ గైకొని ధర్మరాజు నభిషేకించెను. తరువాతఁ బెద్దలగు రాజులు ప్రజలలోఁ దగినవారు వచ్చి ధర్మజు నభిషేకించిరి. అపుడు పట్టాభిషేకానంతరము ధర్మజుఁ డెల్ల ర బహూకరించి యందఱి యాశీస్సుల నంది