పుట:MaharshulaCharitraluVol6.djvu/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహర్షుల చరిత్రలు

బృహస్పతిమహర్షి

జననము

కర్దమప్రజాపతి దేవహూతివలనఁ దొమ్మండుగురు కూఁతుండ్రను గాంచి యా నవకన్యకామణులను నవబ్రహ్మలకిచ్చి వివాహ మొనరించెను. అందు శ్రద్ద యనునామె అంగిరసునిఁ బెండ్లియాడి యాతని ధర్మపత్నియై చిరకాలము పతిశుశ్రూష యొనరించెను. ఆ పుణ్యదంపతుల కడుపునఁ బుట్టినమహనీయులు ఉతథ్యుఁడు, బృహస్పతి, సంవర్తుఁడును.

వీరిలో బృహస్పతి పుట్టుకతోడనే లోకాతీత మగు బుద్దివై భవమును సంపాదించి మించెను. ఉతథ్యుఁడు తీర్థయాత్రా ప్రవణుఁడు, తపఃప్రియుఁడు నయ్యెను. సంవర్తుఁడు మహాయోగీశ్వరుఁడు, జ్ఞాన సంపన్నుఁడు నయ్యెను.

బృహస్పతి శాస్త్రవేదియైన విధము

తొల్లి కల్పాదియందు సప్తమహర్షులగు మరీచి, అత్రి, అంగిరుఁడు, పులహుఁడు, పులస్త్యుఁడు, క్రతువు, వసిష్ఠుఁడును స్వాయంభువమనువును విష్ణుమూర్తి నుద్దేశించి చిరకాలము మహాతపము చేసిరి. వారికి విష్ణువు అదృశ్యరూపమున నిట్లు చెప్పెను. "వత్సలారా! మీరు నన్ను ధర్మశాస్త్రబుద్ధులై యాశ్రయించితిరి. భారతి మీ యందు నిలిచి సకలలోకహితకరమును మర్యాదా ప్రవర్తకము నగు ధర్మశాస్త్రము మీకుఁ గరతలామలకము నొనరించును. దాని నెల్ల లోకములవారు శిరసా వహింతురు. మీరు మహోత్తమ మగు నీ శాస్త్రసారమును అంగిరసునికిఁ బుట్టి మహామతియై పర్ధిల్లు బృహస్పతి యందుఁ బ్రతిష్ఠింపుఁడు. బృహస్పతి యీ శాస్త్రరహస్యములను నా భక్తుఁడై జనించు ఉపరిచర వసువునకు బోధించును. ఆతఁడు దానినిఁ జక్కగ ననుష్ఠించి లోకముల