జైగీషవ్యమహర్షి
31
నెంతయో యాదరము కలదు. అందుచేత నీ యాశ్రమమునకు వచ్చినాఁడు. అతనివలన నీ కెన్నియో శుభము లగును. పొ”మ్మని పలికిరి. దేవలుఁడు, ఒక వంకనాశ్చర్యము మఱియొక వంక జై గీషవ్యునిపై భయభక్తిశ్రద్ధా గౌరవములు నిను మడించుచుండఁగా యోగశక్తిచే నొక్కొక్కలోకము నుండియు దిగుచుఁ దనయాశ్రమమునకువచ్చి చేరెను. అచట మౌననిష్ఠతోఁ గదలక మెదలక జై గీషవ్యుఁ డాతనికిఁ గాననయ్యెను.
దేవలుఁడు జై గీషవ్యుని పాదములపై వ్రాలి " మహాత్మా ! నీవు సామాన్య మానవునివలె వచ్చి నా యాతిథ్య మర్థించితివి. నేను నా యోగశక్తులు నీకుఁ జూపి నీకు వలసినశక్తు లనుగ్రహింతమనుకొంటిని. నా యహంకార ముడిపి నన్ననుగ్రహింప విచ్చేసిన పరమేశ్వరుఁడవే నీవు. నాయందు దయయుంచి కార్యాకార్యస్వరూపము, సన్న్యాస యోగము, మోక్షధర్మములు, సవిస్తరముగా నెఱిఁగింపు" మని ప్రార్థించెను. జై గీషవ్యుఁడు "దేవలా! నీవు సామాన్యునివలె నన్ను స్తుతించితివి. నీవును దక్కువవాఁడవుకావు. మౌననిష్ఠకు యోగ్యమగు తావు నీ యాశ్రమమే యగుట నిచటికి వచ్చితిని. నీవు న న్న తిథిశుశ్రూషల నలరించినావు. నా మౌనవ్రత మింతటితో సరియైనది. నన్ను శ్రద్ధాభక్తుల నీవు సేవించితివి కావున నీవు కోరినను కోరకున్నను నా శక్తులు నీకు రాఁగలవు. శ్రద్ధా భక్తులతో నెవరు విప్రుల సేవింతురో వారికి సర్వసిద్ధులు లభించును. కావుననే, సాధుసజ్జన సాంగత్యము, విబుధారాధనము, విప్రసేవ వ్యర్థముగఁ బోవు. అవి సేవించువారి యోగ్యతనుబట్టి బహుగుణవర్ధిత ప్రతిఫలము నిచ్చితీరును" అని యాతని నేకాంతమునకుఁ దీసికొని పోయి యాతనికి సమస్త ధర్మములు బోధించి, సందేహ నివారణ కావించి యనుగ్రహించెను. దేవలుఁ డాతనిశిష్యుఁ డయ్యెను.
జై గీషవ్య ప్రబోధితుఁ డగుదేవలుఁడు గృహస్థాశ్రమమొల్లక సన్న్యసింపఁబూని తన నిశ్చయమును జై గీషవ్యుని కెఱింగించెను. అంతలో భూతజాలము, పితృదేవతావర్గము నాక్రోశించుచు వచ్చి గృహస్థాశ్రమమును వీడవలదని యాతని నర్థించెను. దేవలుఁడు జై గీషవ్యు ననుమతి