పుట:MaharshulaCharitraluVol6.djvu/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

మహర్షుల చరిత్రలు


గొని తనతపస్సు ధారపోసి భూతతృప్తి కలిగించి పితృదేవతల కుత్తమ గతు లొనగూర్చి పిదప సన్న్యసించి మోక్షధర్మ మవలంబించెను. బృహస్పతి ప్రముఖు లచటి కరుదెంచి దేవల జై గీషవ్యుల నభినందించిరి. దేవలజై గీషవ్య నివాసస్థానమగు నా ప్రదేశము దివ్యతీర్థ మయ్యెను.

మఱియొకప్పుడు పరమప్రాజ్ఞుఁడు పరమశాంతుఁడు పరమ సుఖియునగు జై గీషవ్యుని దర్శించి దేవలమహర్షి 'మహాత్మా! నీ యీ పరమప్రశాంతస్థితికిఁ గారణ మేమి? ఏ యాచారమున, ఏ శీలమున, ఏ విద్యచే ముక్తికలుగును? తెలుపు" మని ప్రార్థించెను, అందులకు జై గీషవ్యుఁ డిట్ల నెను. “దేవలా! శాంతిమంతు లైనసౌమ్యులు నిష్ఠా గరిష్ఠులై యుండు ద్వంద్వాతీత స్థితి యందు నే నుందును. ఆస్థితియందు

"వినుతించిన నిందించిన
 ననఘా ! మనమునఁ బ్రియంబు నప్రియమును లే
 కునికియు వ్రేసిననై నను
 కనలు పొడమమియుఁ బ్రబుద్ధగణ్యగుణంబుల్ .

 ఒకటి కోరి దాని కుల్లంబు కుందంగఁ
 జాలఁబడమి, యేమి సంభవించె
 నేని దానఁ దృప్తి నూనుట తప్పిన
 పనికి వగవకునికి భవ్యగుణము.

 హర్షంబును మానంబు న
 మర్షము నపరాధమును సమదభావము ను
 త్కర్షాపకర్షచింతలు
 ఆర్ష సమాచారమున నిరసగుణంబుల్ .

 అవమానమునకుఁ దృప్తుం
 డవు నమృతముఁ ద్రావినట్ల, యంచితసమ్మా
 నవిధికి నుద్వేగముఁ బొం
 దు విషంబునఁబోలె, శమరతుఁడు మునినాదా!