పుట:MaharshulaCharitraluVol6.djvu/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

మహర్షుల చరిత్రలు


జై గీషవ్యుని ముందు నేనెంత?” యనుకొని సిగ్గుపడెను. ఐన నహంకారము మరల వచ్చి యాక్రమించెను. అంత నాతఁడు తన గొప్పతనమును నిరూపింపఁ దలఁచి జై గీషవ్యుని కన్నులయెదుట మంత్ర పారగుఁడగునాతఁడు శరవేగమున ఆకాశమున కెగిరిపోయి సిద్ధలోకముఁ జేరెను. అప్పటికే యట నున్న జై గీషవ్యుని శిష్యులై సేవించుచున్న సిద్దులను జూచి దేవలుఁ డాశ్చర్యపోయి యటనుండి పితృలోకమున కెగసి పోయెను. అంతకుముందే యక్కడను జై గీషవ్వుఁ డెల్ల రచేఁ బూజింపఁబడుచుంటఁ గాంచెను. దేవలుఁడు వెంటనే యామ్యలోకమున కేఁగెను. అచట కూడ నదియే జరుగుచుండెను. దేవలుని యాశ్చర్యమునకు మేర లేకుండెను. మఱియు నాతఁడు సోమలోకమున కేఁగెను. అక్కడను జై గీషవ్యునకు పూజలే జరుగుచుండెను. దేవలుఁడు తనయోగశక్తి నంతయు వినియోగించి అగ్నిలోకమున కేఁగెను. అక్కడ నంతే. దేవలుఁడు తపోలోకమున కేఁగెను. అక్కడ నంతే. మిత్రావరుణలోకమున కేగెను. అక్కడ నంతియే. ఆదిత్యలోకమున కేఁగెను. అక్కడ నంతియే. రుద్రలోకమున కేఁగెను. అక్కడ నంతియే. వసులోకమున కేఁగెను. అక్కడ నంతియే. బృహస్పతి లోకమున కేఁగెను. అక్కడనంతియే. గోలోకమున కేఁగెను. అక్కడ నంతియే. బ్రహ్మసత్రి లోకమున కేఁగెను. అక్కడ నంతే. పతివ్రతా లోకమున కేఁగెను. అక్కడ నంతే. ఇట్లెల్ల లోకములందుఁ దనకంటె ముందుగా నేఁగి పూజ లందుచున్న జై గీషవ్యుని దేవలుఁడు కాంచెను. పతివ్రతాలోకమున దేవలుఁడు ఱెప్పవాల్పక జై గీషవ్యునిజూడ మొదలిడ నాతఁడట నదృశ్యుఁడయ్యెను. దేవలుఁడు యోగశక్తిచే నెంత యత్నించినను, ఇఁక పై లోకమున కేగలేక, యటనున్న సిద్దులం బిలిచి “మహాత్ములారా! జై గీషవ్య భగవానుఁ డెట కేఁగెను? ఆతనియోగ శక్తి యెంతటిది? అతఁడిపు డేలోకమున నున్నాఁడు? దయతోఁ దెలుపుఁడని ప్రార్థించెను.

సిద్దులు దేవలు నాదరించి " మునీంద్రా ! జై గీషవ్యుఁడు యోగీశ్వరేశ్వరుఁడు. ఆతఁడు శాశ్వత బ్రహ్మలోకమున కేఁగినాఁడు. నీ వది చేరుట కింకను బెక్కు వేలేండ్ల తపస్సు చేయవలయును. ఆతనికి నీపై