Jump to content

పుట:MaharshulaCharitraluVol6.djvu/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరణ్యకమహర్షి

7


భరద్వాజాశ్రమము బ్రవేశించెను. షష్ఠినాడు నందిగ్రామమున భరతసమావేశము జరిగెను. సప్తమినాడు శ్రీరాము డయోధ్యలో బట్టాభిషిక్తుడయ్యెను. రాముని కపుడు నలువదిరెండు సంవత్సరములు సీతకు ముప్పదిమూడు సంవత్సరములు. సీత రావణునింట నున్నది పదునొకండు నెలల పదునాలుగు దినములు.

వత్సా ! రాము డయోధ్య బాలించుచుండగా అగస్త్యమహర్షి విచ్చేసి యాతనిచే నశ్వమేధయాగము చేయించును. ఆ గుర్రము నీ యాశ్రమమునకు వచ్చును. దానివెంట వచ్చిన రామపరివారము నీ వయోధ్య కేగి శ్రీరాముని దర్శింతువు. నాటికి నీ కర్మపూర్తియై నీ తపము ఫలించును. నీవు శ్రీరామసాయుజ్యమునంది మోక్షమంద గలవు."

ఆరణ్యకతపఃఫలాగమము

ఈవిధముగా సెలవిచ్చిన లోమశమహర్షికి నేను సాష్టాంగనమస్కారము చేసి యాతని యాజ్ఞ గైకొని నాటినుండి శ్రీరామమంత్రజప భజన పరాయణుడనై యుంటిని. లోమశ మహర్షి వాక్రుచ్చినట్లే అశ్వము వెంబడి మీరు వచ్చితిరి. నాకును గర్మఫల సమాప్తి పరిపూర్ణము కానున్నది. నా తపఃఫలమును త్వరలోనే నేను గనం గందునుగదా " యని పలికి యారణ్యకమహర్షి యానందపరవశు డయ్యెను.

శత్రుఘ్ను డామహర్షికథ యంతయు విని మిక్కిలి యాశ్చర్యపడి యాతని నయోధ్యాపురికి దగుపరివారముతో బంపి తాను అశ్వము వెంట ముందునకు బోయెను.

రామదర్శనము : సాయుజ్యప్రాప్తి

అయోధ్యాపురము సమీపింపగనే ఆరణ్యకమహర్షి రథమును దిగి పాదచారియై సరయూనదీతీరమున యజ్ఞదీక్షితుడై యున్న శ్రీరామచంద్రుని సమీపించి యాతని రూపమును గనులార గాంచెను. తత్క్షణ మాతడు పులకితశరీరుడై జలజల మని యానంద బాష్పములు