6
మహర్షుల చరిత్రలు
నాటి రాత్రి ఇంద్రజిత్తు రామలక్ష్మణుల నాగపాశమున బంధించుటయు, దశమినాడు వాయువు శ్రీరాముని చెవిలో స్వరూపము జపించుటయు వెంటనే నాగపాశములు వదలుటయు, గరుడుని రాక, ఏకాదశీ ద్వాదశు లందు ధూమ్రాక్షవధ, త్రయోదశిని అకంపనవధ, మాఘశుద్ధచతుర్దశి మొదలు కృష్ణప్రతిపత్తు వరకు ప్రహస్తవధ, మరిమూడు దినములు సంకులయుద్ధము, పంచమిమొదలు అష్టమివరకు కుంభకర్ణుని మేలుకొలుపు, పిదప నారు దినములలో కుంభకర్ణునివధ, అమావాస్యనాడు శోకమున యుద్ధవిరామము, ఫాల్గునశుద్ధ ప్రతిపత్తు మొదలు నాలుగుదినములు బిసతంతుడు మున్నగు రాక్షసులవధ, పంచమిమొదలు సప్తమివరకు అతికాయవధ, అష్టమి మొదలు ద్వాదశివరకు కుంభనికుంభులవధ, పిదప మూడు దినములలో మకరాక్షాదుల చావు, ఫాల్గునబహుళ ప్రతిపద్ద్వితీయలలో ఇంద్రజిత్తు విజృంభణము, తదియ మొదలు సప్తమివరకు విషాదకారణమున యుద్ధవిరామము, త్రయోదశి నా డింద్రజిద్వధ, చతుర్దశిని యుద్ధవిరామము, అమావాస్యనాడు రావడుడు యుద్ధమునకు బయలుదేరుట, చైత్రశుద్ధప్రతిపత్తు మొదలు పంచమి వరకు బెక్కురు రాక్షసులవధ, షష్టి మొదలు లష్టమివరకు మహాపార్శ్వాది రాక్షస సంహారము, నవమినాడు లక్ష్మణశక్తిభేదనము రావణ పలాయనము, ఆంజనేయుడు ద్రోణాద్రిని దెచ్చుట, దశమినాడు రాముడొక్కసారి పెక్కురురాక్షసుల జంపుట. ఏకాదశినా డింద్రుని పంపున యాతని దివ్యరథమునుదెచ్చి శ్రీరాముని కర్పించుట, శుక్లద్వాదశిమొదలు కృష్ణచతుర్దశివరకు ఘోరాతిఘోరయుద్ధము జరుగుత. ఆనాడే రావణవధ శ్రీరామ విజయము సంభవించెను. మాఘశుద్ధ ద్వితీయ మొదలు చైత్రబహుళ చతుర్దశివరకు జరిగిన యుద్ధములో యుద్ధవిరామ దినములు పదునైదు తీసివేయగా డెబ్బదిరెండు దినములు మహాయుద్ధము జరిగెను. వైశాఖశుద్ధ ప్రతిపత్తునాడు శ్రీరామచంద్రుడు సకల సురజేగీయమానుడయ్యెను. విదియనాడు శ్రీరాముడు విభీషణపట్టాభిషేకము గావించెను. తదియనాడు సీతా పాతివ్రత్యశుద్ధి యయ్యెను. చవితినాడు సీతాసహితుడై రాము డయోధ్యకు బుష్పకవిమానమున బయలుదేరెను. పంచమినాటికి బదునాలుగు సంవత్సరములు నిండగా శ్రిరాముడు సపరివారుడై