పుట:Maharshula-Charitralu.firstpart.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మఱియు సమన్వయశక్తి వివిధ పురాణ పరిశీలనా సామర్థ్యము లేనివారి కవి కొన్ని పరస్పరవిరుద్ధములుగను సర్దరిహితములుగను దోఁచుచుండుటలో నాశ్చర్యము లేదు. వివిధ పురాణవిదులగు విద్వద్వతంసు లీవైరుధ్యములను వైతొలఁగించి సమన్వయ మొనరించి యేకముఖముగా నింతవఱ కేభాషలోను గొనిరాకపోవుటతీఱని కొఱఁతయే యనక తప్పదు. ఈ పరిస్థితిలో భగవత్ప్రేరితుఁడనై ముహర్షుల పైఁ గల భక్తితాత్పర్యము లూఁతగాఁ గొని బహుపురాణ ప్రామాణ్యము ననుసరించి యీ గ్రంథమును సంధానించితిని.

మానవ పరిపూర్ణతకు సత్యాహింస శౌదయాగుణములకు నింద్రియనిగ్రహము, తపోబలము. నాత్మజయము మున్నగువాని కన్నిటికి మన ప్రాచీనభారతపర్ష మహర్షులే యెన్ని యుగములకైన నాదర్శప్రాయులు. . వారి జీవితోపదేశములు నిత్యమననపాత్రములు, ఐహికాముష్మిక ఫలప్రదములు.

1945లోఁ దొలుత ముద్రితమైన యీ గ్రంథముస కిది ఆఱవ ముద్రణము. ఆంధ్రమహాజనుల హృదయకమలముల నిది యధివసించుట మిక్కిలి ముదావహము.

ఇట్లు, బుధజనవిధేయుఁడు

బులుసు వేంకటేశ్వరులు

కాకినాడ

1 - 3 - 69