పుట:Maharshula-Charitralu.firstpart.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



అగస్త్యస్తుతి

"ప్రణవపంచాక్షరోపవిషత్ప్రపంచంబుఁ
             గడదాఁక నెఱిఁగిన కఱకలాని
 వాతాపిదైత్యు, నిల్వలునితోఁ గూడంగ
             జఠరాగ్ని వ్రేల్చినసవనికర్తఁ
 గోపించి నహుషునిఁ. గుంభీవనంబుగా
             హుంకార మిచ్చినయుగ్రతేజు
 వానకాలమునాఁడు వండునట్టిననీటి
             కాలుష్య ముడిపెడుకతకఫలముఁ

 బాండుభసిత త్రిపుండ్రాంకఫాలభాగు
 భద్రరుద్రాక్షమాలికాభరితవక్ష "
 వింధ్యగర్వాపహారి నాపీతజలధి
 నయ్యగస్త్యమహర్షి నే నభినుతింతు.
                                      [శ్రీ కాశీఖండము - 2. 161

అత్రిస్తుతి

అంభోజగర్భహృదంభోజసంభవు
            బంఛారిదైత్యసం స్తంభయితుని,
వనితాజనానీక ఘసశిరోరత్న మా
            యనసూయఁ జెట్ట పట్టినగృహస్థుఁ
జంద్రదుర్వాసోమునీంద్రదత్తాత్రేయ
            ఋషిచంద్రములఁ, గన్న ఋషినతంసు
ధర్మశాస్త్రానేక మర్మజ్ఞు. నిర్మల
           కర్మరహస్యు సత్కర్మనిరతు

బహుతపోధన సంయుతు, నిహతనిఖిల
కామరోషాదిశత్రు. దివ్యామలాత్మ
తత్త్వమూ ర్తిని, సప్తర్షి సత్త్వమహితు,
నత్రిఋషిఁ గొల్తు నెపు డిహాముత్రములకు.