పుట:Maharshula-Charitralu.firstpart.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గౌతమ మహర్షి

97


బ్రహ్మదత్తుఁడు గ్రద్దయై పుట్టి యొక నాఁ డొక గ్రుడ్లగూబతో బోరి శ్రీరామునికడకు వచ్చి తగవు తీర్పుమనఁగా నాతఁడు తన పవిత్రహ స్తమున నాగ్రద్దను నిమురఁగా నది శాపవిమోచన మంది బ్రహ్మదత్తుఁడై పోయెను.

గౌతమధర్మసూత్ర - స్మృతి - న్యాయసంహితలు

గౌతమమహర్షి లోకమునకుఁ బ్రసాదించినవానిలో మొదటిది గౌతమధర్మసూత్రములు లేక గౌతమస్సృతి. రెండవ దగు న్యాయశాస్త్రమును ఖండింపఁ జూచిన వ్యాసునిపైఁ గోపించి గౌతముఁడు తనపాదమున నేత్రము సృష్టించుకొని యాతనిఁ జూచెను. నాఁటినుండి గౌతమమహర్షి "అక్షపాదుఁ"డయ్యెను. ఈ గౌతమ న్యాయశాస్త్రము ప్రతిజ్ఞా హేతూదాహరణాది షోడళపదార్థనిరూపకమై పంచాధ్యాయాత్మకమై యొప్పుచున్నది. ప్రథమాధ్యాయ ప్రథమాహ్నికమందుఁ బ్రమాణాది పదార్థనవక లక్షణనిరూపణము, ద్వితీయాహ్నికమున వాదాది సప్తలశణనిరూపణము గలవు. ద్వితీయాధ్యాయ ప్రధమద్వితీయాహ్నికముల సంశయపరీక్షాణాదికము. అర్థా పత్త్యాద్యంత ర్భావనిరూపణము గలవు, తృతీయాధ్యాయమున శరీరేంద్రియార్థబుద్ధిమనఃపరీతణము, చతుర్థాధ్యాయమునఁ బ్రవృత్తి దోషాదికము, దోషనిమిత్తాదికము, పంచమమున భేద, నిగ్రహస్థాన భేద నిరూపణము గలవు.

మూఁడవదగు గౌతమ సంహిత గొప్ప జ్యోతిశ్శాస్త్రగ్రంథము.