పుట:Maharshula-Charitralu.firstpart.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

96

మహర్షుల చరిత్రలు


చంద్రుని పాదారవిందరజః పుంజము నీ శిరస్సుపైఁ బడఁగా నే నీకు శాపవిముక్తి యగును. నాఁడు నీవు తిరిగి పవిత్రాంగివై నా కడకు రావచ్చును. పొ"మ్మని పలికి యింద్రునిఁ జూచి ఓ మహాపాపాత్మా! నీ పైని నాకుఁ గరుణ ముదయించినది. మహర్షులకోపము నీటిపై గీచిన గీఁత వంటిది. నీ యోను లితరులకుఁ గనపడకుండ నుండును. అవి నేత్రములవలెఁ బై వారికిఁ దోఁచును. స్వర్లోకసామ్రాజ్యవిహీనుఁడ వయ్యుఁ దిరిగి కొంత కాలమునకు స్వపదప్రాప్తి నందఁగలవు. పొ "మ్మని కరుణించి గౌతముఁడు హిమగిరి కరిగి తపోనియతి నుండెను. ఇంద్రుఁడు నండము లూడి క్రిందఁబడ దేహమెల్లెడ యోను లేర్పడఁ బళ్చాత్తప్తుడై వెడలిపోయెను. గౌతమమహర్షి శాపమున నింద్రుఁడు పదచ్యుతుఁడై తిరిగి కొంతకాలమునకు స్వారాజ్యము నందఁగల్గెను. అహల్యయుఁ జిర కాలమునకు శ్రీరాముని పాదరజము సోఁకఁగనే స్త్రీరూపము నంది పరమేశ్వర పాద సంస్పర్శచేఁ బవిత్రయై గౌతమమహర్షిని శేరి సేవించుచు మహాపతివ్రతయై వెలసెను.

గౌతముఁడు బ్రహ్మదత్తుని శపించుట

మహర్షి సత్తముఁడగు గౌతము డొకనాఁడు బ్రహ్మదత్తుఁ డనురాజు నింటి కేఁగి యాతిథ్య మిమ్మనెను. ఆతఁడు బ్రహ్మానందముతో నా పరమమునీంద్రు నింట నుంచుకొని చిరకాల మాతని కాతిథ్యమిచ్చి పోషించుచుండెను. అశ్రద్ధ కారణముగా నొకనాఁడు గౌతముని భోజన పదార్థములలో నొక మాంసపుముక్క కాననయ్యెను. గౌతముఁ డాదోషపరిహరణార్థమై బ్రహ్మదత్తను గ్రద్దయై పుట్టుమని శపించెను. బ్రహ్మదత్తుఁడు తనయెఱుఁగమిఁ దెల్సి శాప విముక్తిఁ గోరెను. గౌతముఁడు కరుణించి శ్రీరాముని హస్తము సోఁకగనే యాతనికిఁ బూర్వరూపము లభింప వరమిచ్చెను. ఆ ప్రకారము